మహేష్‌ను ఫాలో అవుతున్న మమ్ముట్టి, సుదీప్.. ఎందులోనో తెలుసా...?
సూపర్ స్టార్ మహేష్‌బాబును చాలామంది అభిమానులు ఫాలో అవుతుంటారు. అందులో వింతేముంది. స్టార్ హీరో అన్న తర్వాత ఆయనలా ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ, ఇప్పడు మహేష్‌బాబును కొందరు నటులు కూడా ఫాలో అవుతున్నారు. ఏ విషయంలోనా? అని ఆలోచిస్తున్నారా..? మహేశ్ బాబు ఇటీవల ఫోన్ పే కోసం తన వాయిస్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. మనం ఫోన్‌పేలో ఎంత పంపించినా మహేష్‌బాబు వాయిస్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా వెళ్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం తమ వాయిస్‌ను ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఫోన్ పేలో వాయిస్ కోసం మహేష్ కంటే ముందే అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇవ్వడం జరిగింది. 2023లోనే అమితాబ్ ఫోన్‌పేకి వాయిస్ ఇచ్చారు. ఇప్పడు ఆ స్థానంలో మహేష్ వచ్చారు. ఇప్పుడు ఇదే బాటలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నడుస్తున్నట్లు సమాచారం. వారే మమ్ముట్టి, సుదీప్. అయితే, ఐదు సెక్షన్ల వాయిస్ కోసం ప్రిన్స్ మహేష్‌బాబు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఈ మధ్య నెట్టంట ఓ వార్త బాగా స్ర్పెడ్ అయ్యింది. ఈ విషయంలో ఇద్దరు స్టార్ హీరోలు సైతం మహేష్‌ను ఫాలో అవుతున్నట్లు సమాచారం. 5 సెకన్ల ఈ ఫోన్ పే వాయిస్ కోసం మమ్ముట్టి, కిచ్చా సుదీప్ అదే రేంజ్‌లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన స్టార్ హీరోలు..:
ఇక, ఈ ఇద్దరు సూపర్ స్టార్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుదీప్ తెలుగులో ఈగ సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుదీప్ ప్రదర్శన మెచ్చుకోదగ్గది. ఎంతో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మరో సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటివలే నటించిన భ్రమయుగం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇక, ఈ సినిమాలో మమ్ముట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ఇటీవలే యాత్ర సినిమాతో దగ్గరయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications