నిహారిక విడాకులు తీసుకుంటుందని ఆయనకు ముందే తెలుసా..?
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.
అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడు ఖండించింది లేదు. అయితే తాజాగా నిహారిక విడాకులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిహారిక విడాకులు తీసుకుంటుందని వారి కుటుంబ సభ్యులు ముందే తెలుసు అనేది ఈ వార్త సారాంశం.

పెళ్లికి ముందే నిహారిక ,చైతన్యల జాతకం చూపించినప్పుడు.. ఇద్దరు జాతకాల్లో దోషం ఉందని .. పరిహార శాంతి పూజలు చేయించాలని పండితులు నాగబాబుకి సూచించారట . కానీ మొదటి నుంచి పూజలు పునస్కారాలు పెద్దగా నమ్మని నిహారిక.. ఆ విషయాన్ని తెలిగ్గా కొట్టిపారేసిందట. నిహారిక ,చైతన్యల పెళ్లి కూడా అనుకున్న మూహార్తానికి జరగలేదని తెలుస్తోంది.
వీరి పేర్ల మీద పెట్టిన ముహూర్తం దాటిపోయిన తరువాత పెళ్లి జరిగిందట. ఫోటోషూట్స్ అంటూ టైం వేస్ట్.. చేసి ఆ తరువాత తిరిగ్గా చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశారట . వీళ్లు విడాకులు తీసుకోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .ఏది ఏమైనప్పటికీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చింది. ఇక నిహారిక కెరీర్ విషయానికి వస్తే...మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications