ఆ హీరోయిన్ తో నటించొద్దు: అల్లు అర్జున్ కు స్నేహారెడ్డి షరతు
అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. తెలుగులోకన్నా హిందీలోనే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాద్వారా గ్లోబల్ హీరోగా మారాలని యోచిస్తున్నాడు. పుష్ప2 చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దాదాపు ఇది రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రిని ఎంపిక చేశారు మేకర్స్. కొద్దిరోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తృప్తితో బన్నీని నటించొద్దని ఆయన భార్య స్నేహారెడ్డి కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం యానిమల్. ఈ సినిమాలో తృప్తి బోల్డ్ సన్నివేశాలు చూసిన తర్వాత స్నేహ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయబోతోంది. ఈ సినిమాతో భారతదేశానికి ఆస్కార్ అవార్డు రాబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుష్ప1లో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ స్నేహా రెడ్డికి మాత్రం తృప్తి దిమ్రి బాగానే మండిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. గుంటూరు కారం తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా? లేదంటే అల్లు అర్జున్ తో చేస్తారా? అనే విషయంలో స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications