బాలయ్యను, శివాజీని వదలొద్దు.. అగ్ర హీరోకు రాజకీయ నేత హుకుం!
తనకు దొరక్క దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో ఉన్న ఓ రాజకీయ పార్టీ నేత తన కుటిల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎప్పటి నుంచో తెలుగు సినీ పరిశ్రమను తన కబంధ హస్తాల్లో బంధించాలనుకుంటున్న ఆ నేతకు అవకాశం మాత్రం దొరకడంలేదు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మార్చి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేయడం, వారికి మరక అంటించడంద్వారా ప్రజలకు దూరం చేయడం లాంటి ప్రణాళికలు అమలు చేయిస్తున్నారు. అందుకు పరిశ్రమలో తనకు అనుకూలంగా ఉన్న ఓ అగ్ర కథానాయకుడిని ఉపయోగించుకుంటున్నారు.
పరిశ్రమను ఒత్తిడిలోకి నెట్టాలని
ఆ రాజకీయ నేతతో, సదరు హీరోకు వ్యాపార సంబంధాలుండటంతో ఔననలేక, కానదలేక, మింగలేక, కక్కలేక ఆ హీరో సతమతమవుతున్నాడు. రాజకీయ నేతలతో స్నేహాలు, పరిచయాలు, వ్యాపారాలు చేస్తే ఎలా ఉంటుందో సదరు హీరోకు ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. ప్రపంచమంతా శివాజీకి మద్దతు పలుకుతుంటే ఈ హీరో మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. బాలయ్య సినిమా అఖండ2కు నష్టాలొచ్చాయి కాబట్టి డబ్బులివ్వాలంటూ ఒత్తిడి చేయించడానికి బయ్యర్లను హైదరాబాద్ పంపించిన సంగతి తెలిసిందే. ఇటువంటి నాటకాలద్వారా పరిశ్రమను ఒత్తిడిలోకి నెట్టాలని, తనకు అనుకూలంగా ఉండేవారు, తన అనుయాయులతో పరిశ్రమను నింపేయాలనే యోచనతో సదరు రాజకీయ నేత ఉన్నారు.

నా పేరు బయటకు వస్తుంది
అయితే మెజారిటీ పరిశ్రమ ప్రతినిధులు ఈ రాజకీయ నేతకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో అతను అనుకున్న పని అంత సులువుగా అవడంలేదు. బాలయ్యపై ఒత్తిడి పెంచమంటే బయ్యర్లు మాట్లాడి వెళ్లిపోయారు. శివాజీపై ప్రచారం చేయించమంటే మధ్యలో వదిలేశారు. ఈ రెండు విషయాలు సదరు రాజకీయ నేతను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. అందుకు ఆ అగ్రహీరోను నిలదీయగా తన పేరు బయటకు వస్తుందని సమాధానం చెప్పినట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల నుంచి కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం.. అయినా ఈ మాత్రం సాయం చేయలేవా? నాకు రాజకీయంగా మైలేజ్ వస్తుందని ఆ హీరోకు చెప్పగా, అతను ఏమీ సమాధానం చెప్పలేదని, అయితే కచ్చితంగా ప్రణాళిక మార్చి అయినా వారిపై బురద జల్లాలంటూ హుకుం జారీచేసినట్లు తెలుగు సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications