'దేవర' కొంప ముంచుతున్న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా తొలిభాగాన్ని వచ్చేనెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. జాన్వీకపూర్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ ఐదోతేదీనే విడుదల కావాల్సిన ఉన్నప్పటికీ అనిరుధ్ స్వరాలందించడంలో ఆలస్యం చేయడంతో వీఎఫ్ఎక్స్ పనుల కోసమని సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేశారు.
సలార్ బ్రేక్ ఈవెన్ అవలేదు
ప్రస్తుతం దేవర చిత్రంపై ఈనెల 15వ తేదీన విడుదలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో తెలుగు పరిశ్రమలో ఒక తేదీలో విడుదల కావాల్సిన సినిమాకు బదులుగా ఆ తేదీలో విడుదలకు వచ్చిన ఏ సినిమా కూడా విజయవంతం కాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సెంటిమెంట్ ను తలుచుకొని బాధపడుతున్నారు. సెప్టెంబరు 28వ తేదీన విడుదల కావాల్సిన సలార్ డిసెంబరు 22వ తేదీకి వెళ్లింది.

స్కందకు రూ.30 కోట్ల నష్టాలు
సలార్ విడుదల కావాల్సిన తేదీకి ఒక రోజు తర్వాత వచ్చిన స్కంద సినిమాకు రూ.50కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినప్పటికీ రూ.30 కోట్ల నష్టాలను మిగిల్చింది. దేవర విడుదల కావాల్సిన ఏప్రిల్ ఐదున విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ వచ్చి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మే9న కల్కి రావాలనుకున్నప్పటికీ రాకపోవడంతో 10వ తేదీన వచ్చిన కృష్ణమ్మ, ప్రతినిధి2, ఆరంభం సినిమాలు కూడా షరా మాములుగానే ఫ్లాపయ్యాయి. పుష్ప2 విడుదల కావాల్సిన ఆగస్టు 15న వచ్చిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు రెండోరోజు నుంచే చేతులు ఎత్తేశాయి. ఏప్రిల్ నుంచి అక్టోబరుకు వెళ్లి అక్కడి నుంచి సెప్టెంబరుకు దేవర వచ్చింది. పవన్ కల్యాణ్ ఓజీ సెప్టెంబరు 27కు వెళ్లి వాయిదా పడటంతో ఆ తేదీకి దేవర వచ్చింది. దేవరకు కూడా ఈ పరిస్థితి తప్పదా? అని తెలుగు పరిశ్రమలో చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications