ఫస్ట్ డే కలెక్షన్లు కూడా ఫేకేనా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన 'గేమ్ ఛేంజర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. మొదటి నుంచి కూడా మెగా అభిమానులు ఈ సినిమాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే గత సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.
Day 1 100cr pettaleka 100cr fake esar entra🤣🤣💦#GlobalFraudRamCharan pic.twitter.com/JRQDbQPGfy
— Rahul Reddy (@rahul_reddi_) January 11, 2025
ముఖ్యంగా ఆయన తీసిన భారతీయుడు 2 డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టుగానే సినిమా అందర్ని నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'గేమ్ ఛేంజర్' నిలిచింది. అయితే ఈ కలెక్షన్లపై కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.

బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం, గేమ్ ఛేంజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు 85 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల నుండి అందిన డేటా ప్రకారం..సీడెడ్ ఏరియా గ్రాస్ 7.6 కోట్లు, తమిళనాడు గ్రాస్ 2.5 కోట్లు, గుంటూరు షేర్ 3.7 కోట్లు కాగా, పశ్చిమ గోదావరి 2.05 కోట్లు (హైర్స్‌తో కలిపి) వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఓవర్సీస్ కు సంబంధించిన లెక్కలు కూడా కలుపుకుని సుమారు 85 కోట్ల వరకు చేరినట్లు చెబుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం సినిమా ఏకంగా రూ.186 కోట్లు వసుళ్లు చేసినట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.అంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగానే తేడా కనిపిస్తోంది.
Big shame for TFI 😥
— 𝙏𝙚𝙢𝙥𝙚𝙧𝘽𝘼𝘽𝙄🌊 (@TemperBABI) January 11, 2025
Max retweets cheyandi 🙏#GameChangerPosterScam
#100crFakeForGameChanger#GlobalFraudRamCharan pic.twitter.com/fgCMEAfGZb
అసలు ట్రాకర్స్ మరియు మేకర్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనే అనేది ఎవరికి అర్థం కావడం లేదు.ట్రేడ్ అనలిస్టులు సాధారణంగా థియేటర్ల నుండి వచ్చిన గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ మేకర్స్, బిజినెస్, ఇతర ఆదాయాల ఆధారంగా కూడా మొత్తం గ్రాస్‌ను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరి డేటా నిజమో నిర్ణయించుకోవడం ప్రేక్షకులకు సవాలుగా మారింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం 'గేమ్ ఛేంజర్' ఫేక్ కలెక్షన్ల అని కొట్టిపారేస్తున్నారు.
Evadaina 10 cr fake chestar ra nv entra direct 100 cr fake 😭#GlobalFraudRamCharan
— Naseee🐶 (@NaseerMsd_07) January 11, 2025
pic.twitter.com/g2tAnN7AIO
సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ అంతటి భారీ కలెక్షన్లు ఎలా సాధిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ నటించిన 'దేవర' కంటే 'గేమ్ ఛేంజర్' మూవీ మొదటి రోజు ఎక్కువ వసూళ్లు సాధించింది. 'దేవర' మొదటి రోజు రూ. 172 కోట్లు సాధిచగా, 'గేమ్ ఛేంజర్' మూవీ రూ.186 కోట్లు వసూళ్లను రాబట్టింది. దీంతో ఎన్టీఆర్‌పై రామ్ చరణ్ గెలిచాడంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Unanimous dengulu baa dorikipoyav @AlwaysRamCharan 😔#GlobalFraudRamCharanpic.twitter.com/30Nw8yhFmb
— 𝑃𝑟𝑎𝑛𝑒𝑒𝑡ℎ⚡️ (@iam_prani_) January 11, 2025
Shame on TFI Boss u Nee Muddhula koduku valla @KChiruTweets 💦💦#GameOver #GlobalFraudRamcharan #Disastergamechanger pic.twitter.com/SR7CTvpAvp
— 𝐓𝐢𝐠𝐞𝐫 𝐋𝐨𝐡𝐢𝐭𝐡 🐯 (@BrutalFanOf_NTR) January 11, 2025












Click it and Unblock the Notifications