నాగచైతన్య పెళ్లిపై అనుమానాలు.. ప్రముఖ జ్యోతిష్యుడినితో నాగ్ మంతనాలు..
టాలీవుడ్‌లో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్య, సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. అయితే, ఇటీవలే వీరిద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి నాగచైతన్య, శోభిత గురించి చిన్న వార్త వచ్చినా నెట్టింట్లో మాత్రం వైరల్‌గా మారుతుంది. ఇక, వీరిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న జరగనున్నట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇప్పడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొడుకు నాగచైతన్య కోసం నాగార్జున ఓ ప్రముఖ జ్యోతిష్యుడిని కలిసినట్లు తెలుస్తోంది. ఎందుకో..ఎంటో.. వివరాలు చూసేద్దాం..
అక్కినేని నాగచైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగిన మరుసటి రోజు ప్రముఖ జ్యోతిష్యుడు, వివాదాల కేరాఫ్‌గా నిలిచిన వేణు స్వామి వీరిపై సంచలన కామెంట్స్ చేశారు. వీళ్లిద్దరు 2027 వ సంవత్సరంలో విడిపోతారు అంటూ షాక్ న్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు ఆయన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వేణుస్వామి మీద ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్‌కి కూడా ఫిర్యాదు చేసింది. ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించారు. అయితే, గతంలో నాగచైతన్య, సమంత పెళ్లి జరిగినప్పుడు కూడా వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమయ్యింది. దీంతో ఇప్పడు కూడా అలా మాట్లాడ్డంతో నాగచైతన్య విషయంలో నాగార్జున కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అందుకే నాగార్జున రీసెంట్‌గా ఒక ప్రముఖ జ్యోతిష్యుని కలిసారు.

జాతకం విషయంలో..
నాగ చైతన్య, శోభిత జాతకాలను తీసుకుని ప్రముఖ జ్యోతిష్యునికి చూపించాడట. అయితే, జ్యోతిష్యుడు వీళ్లిద్దరి జాతకాలు చూసిన తర్వాత చిన్న చిన్న దోషాలు తప్ప, భయపడాల్సిన పనేమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, వీరిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవిస్తారని కూడా చెప్పాడట. దీంతో నాగార్జున కాస్త రిలాక్స్ అయ్యినట్లు సమాచారం. అయితే, ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఒకవేళ వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యమే... ఈ జ్యోతిష్యుడు కూడా చెప్పి ఉండుంటే, నాగచైతన్య, శోభితల వివాహాన్ని నాగార్జున జరిపించేవాడా? లేదా? అన్నది ఇప్పడు నెట్టింట్లో నెటిజెన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు. అయితే, ఇందులో వాస్తవమెంతో తెలియనప్పటికీ ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో మాత్రం హాల్చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications