'దృశ్యం 3' మూవీ ఫస్ట్ రివ్యూ: ట్విస్టుల మీద ట్విస్టులు బాబోయ్..!!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడిన ఓ సామాన్య కుటుంబం.. ఆ సమస్యల నుంచి బయట పడేందుకు ఏం చేసింది అనేదే స్టోరీ.. ఈ కథను థ్రిల్లింగ్ గా సస్పెన్స్, ట్విస్టులతో రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మూవీ మలయాళంలో సంచలన విజయం సాధించడంతో ఆ తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ , తెలుగులో విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్స్ తో రీమేక్ అయింది. అలా తెలుగు, తమిళ్, కన్నడ ఇలా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది దృశ్యం మూవీ.
అయితే దృశ్యం మూవీ 2013 లో రిలీజ్ అయింది. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021 లో దృశ్యం 2 మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. కేసు మళ్లీ రీ ఓపెన్ చేసినప్పుడు జార్జికుట్టి(మోహన్ లాల్) తన టాలెంట్, ప్లానింగ్ తో పోలీసులకు ఎలా మైండ్ బ్లాంక్ చేశాడనేది ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ స్ఫూర్తితో దృశ్యం 3 సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జీతూ జోసెఫ్. ఈ మూవీ మే 21 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలకు మించిన ట్విస్టులు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ కు గూస్ బంప్స్ పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్, మీనాతో పాటుగా ఎస్తేర్ అనీల్, అన్సీబా హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

దృశ్యం ఒకటి, రెండు భాగాల్లో జార్జికుట్టి(మోహన్ లాల్) కి తన వెనుక పోలీసులు పడ్డారని.. ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబం తమను టార్గెట్ చేసిందని స్పష్టంగా తెలుసు. శత్రువు ఎవరో తెలుసు కాబట్టి ప్లాన్ చేయడం ఈజీ అయింది. కానీ ఈసారి కథ భిన్నంగా ఉండబోతుంది. జార్జికుట్టి పాత తప్పుల తాలూకా పరిణామాలను ఎదుర్కుంటుంటాడు. అయితే అతని వెనక ఎవరు పడ్డారనేది తెలుస్తుంది.. కానీ అసలు తనను ఫాలో అవుతుంది ఎవరు..? పోలీసులు ఉన్నారా.. లేక మరేవరైనా..?
ఈ అపరిచిత శత్రువు చుట్టే కథ నడుస్తుంది. ఇక దృశ్యం 3 మూవీ విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు. ఇక ఈ మూవీ మే 21 న మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications