స్టేజిపైనే హీరోయిన్ ను పొట్టు పొట్టు కొట్టిన యంగ్ హీరో (వీడియో)
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కు ఇప్పుడు స్టార్ హీరోకు మించిన క్రేజ్ ఉంది. చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లవ్ టుడ్, డ్రాగన్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ తమిళ హీరో. ఆయన సినిమాలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెలుగులోనూ ప్రదీప్ రంగనాథన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. లవ్ టుడ్, డ్రాగన్ మూవీస్ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో ఆయన మూడో చిత్రం డ్యూడ్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ మూవీ అక్టోబర్ 17 న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైంది.
#PradeepRanganathan and #MamithaBaiju Recreating the "Cute ah ila" Scene from #Dude Trailer..😅💥
— Laxmi Kanth (@iammoviebuff007) October 15, 2025
pic.twitter.com/dNEM4H8OYf
అయితే ఈ మూవీ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ మూవీ హీరోయిన్ మమితా బైజు స్టేజీపైనే ఫన్నీ స్కిట్ చేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా బుధవారం నిర్వహించిన స్వాగ్ ఈవెంట్ లో వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేశారు. డ్యూడ్ సినిమాలోని ఓ క్యూట్ సీన్ ను స్టేజీపైనే రీ క్రియేట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్కిట్ లో భాగంగా హీరో ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్ మమితా బైజు బుగ్గ గిల్లి.. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తాడు. అలాగే వెనకాల నుంచి హీరోయిన్ ను మోకాలితో తన్నుతూ వీడియోలో ఉంది. సినిమాలో చేసిన మాదిరిగానే స్టేజీపై నటించారు ఈ హీరోహీరోయిన్లు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ క్యూట్ సీన్ ను ట్రైలర్ లోనూ పెట్టారు. ట్రైలర్ చూడని వాళ్లకు హీరో ఏంటి ఇలా అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని అనిపిస్తుంది. కానీ ట్రైలర్ చూసిన వాళ్లకు మాత్రం కేవలం రీ క్రియేట్ చేశారని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 17 న విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ బజ్ ఉంది. రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications