అల్లు అర్జున్‌కి బిగ్ షాక్.. బ్యాంక్ స్కాంలో అల్లు అరవింద్ !
చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు ఫ్యామిలీ మరోసారి చిక్కుల్లో పడింది. రీసెంట్ గానే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ విషయంలో అల్లు అరవింద్ పేరు తెరపైకి రావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. సుమారు మూడు గంటల అధికారులు ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌ను అధికారులు ఆదేశించినట్టు సమాచారం.

బ్యాంక్ స్కామ్ వివరాలు..
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 101.48 కోట్ల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి విచారణ ప్రారంభించింది. 2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లలో సోదాలు నిర్వహించిన ఈడీ దాదాపు రూ. కోటి 45 లక్షల మేర నగదు సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశారని, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని సమాచారం.
కాగా ఈ కేసుకు సంబంధించి అల్లు అరవింద్ పేరు ఆ సంస్థ లావాదేవీల్లో ప్రస్తావించబడటంతో ఈడీ విచారణకు పిలిపించింది. వాస్తవంగా ఆయనకు ఆ సంస్థతో ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, గీత ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ, ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.
-
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications