శంకర్‌కు ఈడీ భారీ షాక్.. ఆస్తుల జప్తు!
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ (Shankar)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో శంకర్‌కు చెందిన దాదాపు రూ. 10కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ గురువారం వెల్లడించింది.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తన కథ 'జిగుబా'ను కాపీ కొట్టి శంకర్ 'రోబో' సినిమా రూపొందించారని అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేస విషయంపై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా రావడం గమనార్హం. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని పేర్కొంది. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.
ED, Chennai has provisionally attached 3 immovable properties registered in the name of S. Shankar, with a total value of Rs.10.11 Crore (approx.) on 17/02/2025 under the provisions of PMLA, 2002.
— ED (@dir_ed) February 20, 2025
కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన రోజో సినిమా 2010లో విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి శంకర్ పారితోషికంగా రూ. 15 కోట్లు అందినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications