ఎమ్మీ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ దర్శకురాలిగా ఏక్తా..
బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత ఏక్తా కపూర్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. హిందీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు ఏక్తా. ఎంతోమందికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టారు. ఒకపక్క నిర్మాత గాను, దర్శకురాలిగాను ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటూ అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన 51 వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుక ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డైరెక్టరేట్ అవార్డు ఈమెను వరించింది. ఆర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఏక్తాకపూర్ చేసిన కృషికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళా దర్శకురాలు ఏక్తా కపూర్ కావడం విశేషమనే చెప్పుకోవాలి. ఈ అవార్డును ఆమె ప్రముఖ రచయిత దీపక్ చోప్రా చేతుల మీదుగా అందుకున్నారు. అయితే, ఈ అవార్డును అందుకునే క్రమంలో ఏక్తా కాస్త ఎమోషన్‌ల్ అయ్యారు. అవార్డును చూపెడుతూ ఇది ఇండియా కోసం అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.
ఈ అవార్డ్స్‌ను అమెరికాలో ఇస్తారు. అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ టెలివిజన్ రంగంలోని షోలు, సిరీస్‌లకు ఈ అవార్డ్‌ను ఇవ్వడం జరుగుతుంది. ఇక ఓటీటీ వంటివి వచ్చాక కూడా అందులో వచ్చే రెగ్యులర్ షోలు కూడా కలిపి ఈ అవార్డులని అందజేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ కేటగిరిలో అనేక దేశాల నుంచి పోటీదారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎమ్మీ అవార్డ్స్‌ను 74 ఏళ్ళ క్రితమే ప్రారంభించారు. అయినా, వీటికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ మాత్రం సుమారుగా యాభై (50) ఏళ్ళ నుంచి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియా కూడా అవార్డులు సొంతం చేసుకుంది.

ఏక్తాతో పాటు మరొకరికి అవార్డు...
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ప్రఖ్యాత ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డుని సొంతం చేసుకున్నారు. తన బాలాజీ టెలి ఫిలిమ్స్ సంస్థపై ఎన్నో టీవీ షోలు, సీరియల్స్, ఓటీటీ షోలు, సిరీస్‌లను తెరకెక్కించారు ఏక్తాకపూర్. ఈ షోలు ఎంతో సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు గాను ఆమెకు ఈ అవార్డుని అందించడం జరిగింది. అయితే, ఏక్తాతో పాటు మరో వ్యక్తి కూడా ఈ అవార్డును అందుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న ఇండియన్ కామెడీ షో 'వీర్ దాస్ ల్యాండింగ్‌కి కూడా ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కామెడీకి గాను వచ్చింది. ఈ అవార్డు కోసం ఎన్నో షోలు పోటిపడ్డాయి. అయితే, చివరికి మరొక షో 'డెరి గర్ల్స్' కూడా టై అయి 'వీర్ దాస్'తో ఈ అవార్డుని షేర్ చేసుకుంది. వీర్ దాస్ గతంలో కూడా రెండు సార్లు ఇదే షో నుంచి నామినేట్ అయ్యారు. కానీ, ఎప్పడు అతనిని విజయం వరించలేదు. ఈసారి మాత్రం వీర్‌దాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. తమ సోషల్ మీడియాలో వీరిద్దరూ అవార్డులతో దిగిన ఫోటోలని పోస్ట్ చేయగా, దీంతో దేశవ్యాప్తంగా వీరిద్దరికీ అభినందనలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications