"బిగ్ బాస్ 9"లో టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయ్యే ముగ్గురు ఎవరంటే..?
"బిగ్ బాస్".. బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 9వ సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో రేపటితో ముగియనుంది. 14వ వారంలో డబుల్ ఎలిమినేషన్ అవ్వగా.. సుమన్ శెట్టితో పాటు భరణి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ఇమ్మానుయేల్, పవన్, కళ్యాణ్, సంజన, తనూజ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా .. తమ ఫెవరేట్ కంటెస్టెంట్స్ కోసం వారి మిత్రులు, మాజీ కంటెస్టెంట్స్ అండగా నిలుస్తూ ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 9 ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతుంది. దీంతో టైటిల్ గెలుచుకునేది ఎవరా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ, లేదా ఇమ్మానుయేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు.

అయితే కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. మొదటి నుంచి కూడా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్న కానీ.. మళ్లీ టాస్కులలో, బిహేవియర్ తో మళ్లీ గట్టిగానే కం బ్యాక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. అలానే డీమాన్ పవన్ కి కూడా ఓటింగ్ బాగా పెరిగిందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రీతూ చౌదరి ఎలిమినేషన్ వరకూ కూడా.. డీమాన్ పవన్ అనేటోడు హౌస్‌లో ఉన్నాడంటే.. అది కేవలం లవ్ కంటెంట్ ఇవ్వడం వల్లే అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రీతూ ఎలిమినేట్ అయ్యిందో.. డీమాన్ కాస్తా ఫిజికల్ టాస్క్‌లలోనే కాకుండా.. తన ఆటలోనూ, మాటలోనూ, ప్రవర్తనలోనూ సెకండద వెర్షన్ చూపించి అలరించాడు. ఇక సంజన సైతం చివర్లో నెట్టుకొస్తుంది. అయితే కేవలం టాప్ 2 మాత్రమే ఉండి.. ఈరోజు ముగ్గురు ఎలిమినేట్ కానున్న తరుణంలో ఎవరా ముగ్గురు అని చర్చ నడుస్తోంది.
బయటికి వెళ్లే వారిలో ముందుగా సంజన ఉండగా.. ఆ తర్వాత పవన్ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత 3వ కంటెస్టెంట్ గా వెళ్లిపోయేది ఇమ్మానుయేల్ లేదా తనుజా అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాప్ 3 ప్లేసుల్లో పవన్, తనూజ, ఇమ్మూ మధ్య గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications