సినిమా చూసి గుండె ఆగిపోతే ఎవరిదండి బాధ్యత!

సాధారణంగా దెయ్యం కథలంటే పగ, ప్రతీకారం, రక్తపాతం.. కానీ ఈ మూస ధోరణిని బ్రేక్ చేస్తూ, 'చనిపోయినా చావని తల్లి ప్రేమ' అనే ఒక అద్భుతమైన ఎమోషన్‌తో వచ్చిన సినిమా 'ఎర్రచీర'. హైదరాబాద్ శివార్లలోని చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటనకు వెండితెర రూపమే ఈ చిత్రం. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ:

నిజం నిద్రపోయినా.. అన్యాయం నిలదీస్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఆస్తి కోసం సొంత మనుషులే ఒక తల్లిని కిరాతకంగా చంపేస్తారు. కానీ, ఆ తల్లి ప్రాణం పోయినా ఆమె ఆత్మ మాత్రం తన బిడ్డ చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ పసిబిడ్డను క్షుద్ర శక్తుల నుండి, క్రూరమైన మనుషుల నుండి కాపాడుకోవడానికి ఆ తల్లి ఆత్మ చేసిన అదృశ్య యుద్ధమే ఈ 'ఎర్రచీర'. చివరకు ఆ 'తల్లి ఆత్మ' తనను చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఆ పాప సురక్షితంగా బయటపడిందా? అనేది వెన్నులో వణుకు పుట్టించే క్లైమాక్స్.

Erra Cheera Movie Review An Emotional Horror Thriller of a Mother Revenge supernatural horror

విశ్లేషణ:

దర్శకుడు సుమన్ బాబు ఈ చిత్రాన్ని కేవలం భయపెట్టడానికే కాకుండా, గుండెను పిండేసేలా మలిచారు.సినిమాలోని 20 శాతం వాస్తవ సంఘటనలు కథకు సహజత్వాన్ని తెచ్చాయి.ఇంటర్వెల్ లో ఇచ్చే మలుపు సెకండాఫ్ పై అంచనాలను పెంచితే, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్ కలిగిస్తుంది. బాబాల ముసుగులో జరిగే మోసాలను, క్షుద్ర పూజల వెనుక ఉన్న చీకటి కోణాలను ఎండగట్టిన తీరు ప్రశంసనీయం.

నటీనటుల పర్ఫార్మెన్స్:

బేబీ సాయి తేజస్విని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అనిపించుకుంది. భయంకరమైన హారర్ సీన్స్‌లో ఆ చిన్నారి చూపిన పరిణతి ఆశ్చర్యకరం. సినిమాకు ఈమె పెర్ఫార్మెన్స్ ఒక పిల్లర్.సుమన్ బాబు ఇటు నటుడిగా అటు దర్శకుడిగా తన మార్క్ చూపించారు. ముఖ్యంగా పోలీస్ మరియు స్పిరిచువల్ యాంగిల్స్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. కారుణ్య చౌదరి ఆవేదన భరితమైన తల్లి పాత్రలో ప్రాణం పోశారు.ఇతర నటులైన శ్రీరామ్, అజయ్, రఘుబాబు వంటి 23 మంది సీనియర్ల రాకతో ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

చిన్న సినిమా అయినా VFX (గ్రాఫిక్స్) క్వాలిటీ అద్భుతంగా ఉంది. దేవతలకు, రాక్షస శక్తులకు మధ్య జరిగే పోరాట దృశ్యాలు విజువల్ వండర్‌గా ఉన్నాయి. ప్రమోద్ కుమార్ నేపథ్య సంగీతం (BGM) హారర్ సీన్స్‌లో ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఇక వివాదాస్పదమైన '36 ముద్దుల పాట' కథలో భాగంగానే రావడం ఒక సర్ ప్రైజ్.

ప్లస్ పాయింట్స్:
బేబీ సాయి తేజస్విని అద్భుత నటన.

హారర్ జోనర్‌లో మదర్ సెంటిమెంట్ పండటం.

సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్.

'ఎర్రచీర-2 (అంబిక)' పై క్రియేట్ చేసిన హైప్.

ఫైనల్ :
'ఎర్రచీర' కేవలం రొటీన్ దెయ్యం కథ కాదు.. అది ఒక తల్లి మనసులోని ఆక్రందన. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారితో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తప్పక చూడాల్సిన ఎమోషనల్ హారర్ డ్రామా ఇది.

బాటమ్ లైన్: తల్లి ప్రేమ చావదు.. అన్యాయాన్ని క్షమించదు.

రేటింగ్: 2.75 / 5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+