అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయి
ఇటీవల ఫోక్ సాంగ్స్ తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లు.. అర్ధరాత్రి ఓ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సాయి.. మాధురితో ఉండటాన్ని అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పటి నుంచి ఈశ్వర్ సాయి పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక అనేకమంది నెటిజన్లు అతడ్ని ట్రోల్ చేస్తూ వందల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వివాదంపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు ఈశ్వర్ సాయి. తాను చేసింది తప్పేనని.. ఒత్తిడితో అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తన భార్యతో గొడవలు జరిగాయని.. చాలా ప్రెజర్ గా ఉన్న సమయంలో తనకు మాధురి కనెక్ట్ అయిందని తెలిపాడు. తమ మధ్య ఐదేళ్లుగా పరిచయం ఉన్నా.. తాము రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది మాత్రం రెండున్నర నెలల క్రితమేనని స్పష్టం చేశాడు. ఆమెతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యానని తెలిపాడు.

అయితే ఆయనపై నెటిజన్లు మరింతగా ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈశ్వర్ సాయి మరో సంచలనాత్మక వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు. మీరు ఎందుకు అంతగా ట్రోల్ చేస్తున్నారు. మీడియా అయితే రకరకాలుగా ఇష్టమొచ్చినట్లుగా కథనాలను ప్రచారం చేస్తోంది. మేమిద్దరం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని ఇప్పటికే మీ అందరికీ చెప్పాను. ఆరోజు జరిగింది కేవలం 10 శాతం మాత్రమే.. 90 శాతం ఏం జరిగిందో మీకు తెలియదు. ఆ రోజు నాకు షూటింగ్ ఉంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకే నేను షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. నేను అంతకు ముందే నిద్రలేచి వాష్ రూమ్ కు వెళ్లాలని అనుకుంటే నా అసిస్టెంట్ అందులో ఉన్నాడు. అప్పుడు నేను మాధురి వాష్ రూమ్ కోసం వెళ్లాను. అదే సమయంలో ఎవరో నా భార్యను కావాలని తప్పు బట్టి ఈ విషయాన్ని నా భార్యకు తెలియజేశారు.. అని వీడియోలో పోస్టు చేశాడు ఈశ్వర్ సాయి.
ఆ తర్వాత నా భార్య అక్కడకు వచ్చి గొడవ చేసింది. గొడవ పెద్దగా అవుతుందని మేము సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది.. అని ఈశ్వర్ సాయి తెలిపాడు. కానీ ఆయన మాటలను చాలామంది నమ్మడం లేదు. కేవలం అండర్ వేర్ తోనే వాష్ రూమ్ కు ఈశ్వర్ సాయి ఎందుకు వెళ్లాడు..? ఎవరైనా అలా వెళ్తారా..? అంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications