74లోనూ 'తలైవా' జిమ్ పవర్.. వీడియో వైరల్
Super Star Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ,లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. 'కూలీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన 74వ ఏట కూడా యువకులను మించిపోయే ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న ఒక వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రజనీకాంత్ డంబెల్స్ ఎత్తడం, స్క్వాట్స్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆయనపై మరింత గౌరవం పెంచుకున్నారు.
'కూలీ' బిగ్ హిట్.. వర్కౌట్ వీడియో హల్చల్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 171వ చిత్రం 'కూలీ' ఆగస్టు 14న విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.65 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒకవైపు సినిమా థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొనగా.. మరోవైపు ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2025తో తన సినీ జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ఈ వయస్సులో కూడా తన ఆవేశం, స్టైల్ తగ్గలేదని నిరూపించారు. ఆయన ఫిట్‌నెస్ చూసి అభిమానులు 'సలాం తలైవా' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రజనీకాంత్ ఫిట్‌నెస్ రహస్యం ఇదే..
వైరల్ అయిన 26 సెకన్ల వీడియోలో రజనీకాంత్ ఒక రిసార్ట్ అవుట్‌డోర్ జిమ్‌లో కనిపించారు. అక్కడ ఆయన కోచ్ సూచనల మేరకు డంబెల్స్ ఎత్తడం, స్క్వాట్స్ వంటి కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు. ఆయన క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, యోగా, ఉదయం నడక వంటివి ఆయన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్ తరచూ చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో ఉదయం పూట నడుస్తూ కనిపిస్తుంంటారు.
ఆగస్టు 2న 'కూలీ' ఆడియో లాంచ్ సందర్భంగా రజనీకాంత్ తన ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. ధూమపానం, మద్యం సేవించడం తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించారు. ఆరోగ్యంగా ఉండటానికి చాలా సంవత్సరాల క్రితమే ఈ అలవాట్లను పూర్తిగా మానేశానని ఆయన తెలిపారు. యువత కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, వ్యాయామం చేయాలని ఆయన సూచించారు.
తదుపరి సినిమా 'జైలర్ 2'
'కూలీ' సినిమా భారీ విజయం తర్వాత రజనీకాంత్ త్వరలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2'లో నటించనున్నారు. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది. 50 ఏళ్ల సినీ జీవితంలోనూ రజనీకాంత్ కొత్త సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
Thalaivar Unseen workout video 💥🔥
— Rajnism 🤘 (@Rajinism3) August 14, 2025
He is a great motivation 💥🔥#Rajinikanth𓃵 #Thalaivar #CoolieThePowerHouse pic.twitter.com/pcPI9iiFpY












Click it and Unblock the Notifications