అతను ఏ సినిమా చేస్తే ఆ సినిమా ఫ్లాపే..!

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌లకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో, హీరోయిన్ కాంబినేషన్‌లో ఓ సినిమా హిట్ అయితే, వీరి కాంబినేషన్‌లో మరో సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. హీరో ఒక్కసారి ఓసారి దర్శకుడితో హిట్ కొట్టాడంటే, మళ్లీ ఆ హిట్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ వేరు. అయితే విచిత్రం ఏమిటంటే సినీ ఇండస్ట్రీలో ఒకరు తెలుగులో ఏ సినిమా చేసినా అది ఫ్లాప్‌గానే నిలిచింది. అతను మరెవరో కాదు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్.

తమిళ ఇండస్ట్రీలో హారిస్ జయరాజ్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.దశాబ్దానికి పైగా సినీ సంగీత ప్రపంచాన్ని తన బీట్స్, మెలోడీలతో ఉర్రూతలూగిస్తున్న పేరు హారిస్ జయరాజ్. చెన్నైకి చెందిన ఈ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు, తన వినూత్న శైలి, అధునాతన సౌండ్ డిజైనింగ్‌తో శ్రోతల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాటలు వినగానే వెంటనే గుర్తుపట్టేలా ఒక ప్రత్యేకమైన ముద్రను కలిగి ఉంటాయి. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఆయన రూపొందించే ట్రెండీ బీట్స్, హుషారైన మెలోడీలు ఎంతో ఆదరణ పొందాయి.

Every movie he makes is a flop

కేవలం బీట్స్, రిథమ్‌కే పరిమితం కాకుండా, హారిస్ జయరాజ్ పాటల్లో ఒక గాఢమైన భావోద్వేగం, తాజాదనం కనిపిస్తాయి. ప్రతీ పాటకు ఒక ప్రత్యేకమైన వాయిద్యాన్ని ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా సంగీతాన్ని కూర్చడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన పాటలు వింటున్నప్పుడు ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. తమిళ హీరోలకు తన సంగీతంతో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్‌ను అందించారు హారిస్ జయరాజ్‌.

ఇదే సమయంలో ఆయన పలు తెలుగు సినిమాకు సైతం మ్యూజిక్ అందించడం జరిగింది.వెంకటేశ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలకు ఆయన సంగీతం అందించారు.విచిత్రం ఏమిటంటే ఆయన తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. వాసు,సైనికుడు,మున్నా,స్పైడర్, ఆరెంజ్ ,ఘర్షణ వంటి సినిమాలకు హారిస్ జయరాజ్‌ మ్యూజిక్ అందించారు.

సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ , సంగీతపరంగా హారిస్ జయరాజ్‌ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇటీవల కాలంలో తమిళ ఇండస్ట్రీలో కూడా హారిస్ జయరాజ్‌ హవా తగ్గింది. స్టార్ హీరోలందరూ కూడా అనిరుధ్‌తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హారిస్ జయరాజ్‌ డిమాండ్ తగ్గిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+