కల్కి హిట్‌తో అంతా హ్యాపీ.. ఆ ఒక్క హీరో తప్ప?

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ చిత్రం విడుదలై ఘనవిజయం దిశగా దూసుకువెళుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణంతోపాటు ఇతర స్టార్ నటులు కూడా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్ గా రూపుదిద్దుకుందని, తెలుగు సినిమా స్థాయిని మరోస్థాయిలో నిలబెట్టిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. నాగ్ అశ్విన్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటున్నారు.

హోరెత్తుతున్న ఫోన్లు
సూపర్ హిట్ అవుతుందా? బ్లాక్ బస్టర్ అవుతుందా? అనేది తేలడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. కానీ కల్కి విజయంపై ప్రభాస్, అశ్వనీదత్, నాగ్ అశ్విన్ తోపాటు తారాగణంతోపాటు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా సంతోషంగా ఉన్నారు. దీన్నిస్ఫూర్తిగా తీసుకొని మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించవచ్చని అంటున్నారు. ప్రభాస్ కు, నాగ్ అశ్విన్ కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిద్దరి ఫోన్లు ఉదయం నుంచి హోరెత్తిపోతున్నాయి.

Everyone is happy with the hit of Kalki 2898 ad movie except that one star hero

ప్రభాస్ స్థానాన్ని ఆక్రమిస్తాం..
కల్కి హిట్ వల్ల అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ ఒక స్టార్ హీరో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సదరు హీరో కూడా పాన్ ఇండియా హీరోగా ఇప్పుడిప్పుడే రూపాంతరం చెందుతున్నాడు. ఇటీవలే విడుదలైన అతని చిత్రం తెలుగులోకన్నా హిందీలోనే విజయం సాధించింది. రానున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగానే చేస్తూ ప్రభాస్ స్థానాన్ని ఆక్రమిస్తాడని ఆ హీరో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు హోరెత్తిస్తున్నారు.

ఇండియాలో నెంబర్ వన్ హీరోగా డార్లింగ్..
ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. అతని హీరోయిజం, క్రేజ్ ధాటికి సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలే ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభాస్ ను దెబ్బకొట్టి, అతని స్థానాన్ని ఆక్రమించడం అంటే అంత తేలికయ్యే పనేంకాదు. పరిశ్రమలో అందరితో ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా మసలుకుంటాడు. సదరు హీరో మాత్రం అందరినీ అలా దగ్గరకు తీయలేడు. మరి భవిష్యత్తులో ఏం చేస్తాడో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+