నిహారిక క్లోజ్ ఫ్రెండ్‌తో మాజీ భర్త పెళ్లి.. రివేంజ్ మామూలుగా లేదుగా..?
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.
అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు. ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది.

పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టిట వైరల్ అవుతోంది. జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే నిహారిక క్లోజ్ ఫ్రెండ్‌తోనే జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నిహారిక విషయానికి వస్తే తాను రెండో పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్లు సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు, పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications