ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..? బాలయ్య వాయిస్ ఓవర్ అద్దిరిపోయిందిగా..!

ఫహద్ ఫాజిల్ అనగానే మనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీనే గుర్తుకొస్తుంది. కానీ ఆయన మలయాళంలో చాలా సినిమాలే చేశారు. 2002 నుంచే ఫహద్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కిన మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ సరికొత్త కథాంశంతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఆసక్తిగా సాగింది. మాయలు, వింతలు, విశేషాలు, చిన్నారి మ్యాజిక్ ఇలా అనేక అంశాల చుట్టూ ఈ కథ సాగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ కు బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో క్రేజీ పాయింట్ అని చెప్పొచ్చు. బాలయ్య తన దైన శైలిలో వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. దాంతో ట్రైలర్ పై ఆసక్తి పెరిగింది.

fahadhfaasil Don t Trouble the Trouble movie trailer released now featuring Balakrishna voiceover

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉండేది. దానికి రెండు విషయాలు చాలా బాగా తెలుసు.. ఒకటి డబ్బులు.. రెండు ట్రబుల్.. ఎక్కడ డబ్బులున్నా అది వాసనతో పసిగట్టేసేది. ఎక్కడ ట్రబుల్ ఉన్నా అది తప్పించుకుని పారిపోయేది. ఒకరోజు డబ్బులు.. ట్రబుల్ ఒకేసారి ఎదురయ్యాయి. నక్కకి డబ్బులు మాత్రమే కనిపించాయి.. దాని పక్కనే ఉన్న ట్రబుల్ కనిపించలేదు.. అని బాలకృష్ణ ఇచ్చిన వాయిస్ ఓవర్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ చూస్తుంటే ఇది ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ట్రైలర్ ప్రకారం ఈ మూవీలో ఫహద్ ఓ మెజిషియన్ గా అలరించనున్నారు. ఈ క్రమంలోనే ఓ అనాథ పాపతో అతడికి పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత హీరోతో పాపకు ఉన్న సంబంధం ఏంటి..? పాపకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఎలా వచ్చాయి..? ఆ శక్తుల వల్ల హీరోకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ సాగింది.

చూస్తుంటే ఫహద్ ఫాజిల్ అకౌంట్ లో మరో హిట్ పడేట్టు కనిపిస్తోంది. ఇక 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాతలు శోభు యార్లగడ్డతో కలిసి రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+