Don't Trouble The Trouble First Review: ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫస్ట్ రివ్యూ
మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఆవేశం, కుంబలంగి నైట్స్, పుష్ప సిరీస్, మహేశింతే ప్రతీకారమ్, జోజి, ట్రాన్స్, విక్రమ్, బెంగళూరు డేస్ ఇలా ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ తన యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేస్తుంటారు ఆయన. అయితే తాజాగా ఆయన ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. అదే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ.. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో.. సారా పాలేకర్ కీలక పాత్రలో నటించిన ఈ ఫాంటసీ ఎంటర్ టైనర్ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ను జారీ చేసింది. అంటే పిల్లలు కూడా ఈ మూవీని చూసే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలుగా ఉంది.
ఈ చిత్రానికి ఎస్. ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ మూవీకి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీని ఆర్కా మీడియా వర్క్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. ఇక అడ్వెంచర్ ఫాంటసీ మూవీ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కే. రాఘవేంద్రరావు కూడా ఈ ఈవెంట్ కు హాజరై ప్రసంగించారు. దాంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇది ఒక కొత్త జానర్ కాబట్టి ట్రైలర్ రిలీజ్ నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఓ దెయ్యాన్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది..? అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు స్పష్టం అవుతోంది. తెలుగులో ఇలాంటి స్టోరీతో సినిమాలు రావడం చాలా అరుదు. అందులోనూ రాజమౌళి సమర్పణలో ఆయన కుమారుడు కార్తికేయ నిర్మాతగా చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో చాలా కేర్ తీసుకుని చేసి ఉంటారని కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఇప్పటికే అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మూవీ మొత్తం దాదాపు ఫాహద్ ఫాజిల్, చిన్నారి సారా చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక వీళ్లిద్దరి యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ కూ తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థం అవుతోంది. మరి అక్టోబర్ 2 న ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..












Click it and Unblock the Notifications
