Jabardasth Faima: 9 ఏళ్ల సీక్రెట్ లవ్ కు ఫుల్ స్టాప్.. 'జబర్దస్త్' ఫైమా- ప్రవీణ్ పెళ్లి ఫొటోలు వైరల్..
తన యాస, నటన, కామెడీ టైమింగ్ తో జబర్దస్త్, పటాస్ షోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది లేడీ కమెడియన్ ఫైమా.. పటాస్ షోతో కెరీర్ ను స్టార్ట్ చేసి ఫైమా.. కొద్దికాలంలోనే తన యాస, ఊరమాస్ కామెడీ పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోతో చాలా పాపులర్ అయింది. అక్కడినుంచి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో టాలెంట్‌తో ఇండస్ట్రీలో సెటిలైపోయింది. అయితే జబర్దస్త్ ఫైమా అందరికీ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
జబర్దస్త్ ఫైమా ఎట్టకేలకు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను నేడు రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పెళ్లి చేసుకుంది. దాంతో 9 ఏళ్ల సీక్రెట్ లవ్ కు ఫుల్ స్టాప్ పడింది. పెళ్లితో ఈ జంట ఏకమైంది. ఈ మేరకు ప్రవీణ్ తో పెళ్లి జరిగినట్లు ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ పోస్టు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

జూన్ 23 న అతికొద్దిమంది సమక్షంలో ప్రవీణ్- ఫైమా రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె పెట్టిన పోస్టులో.. వాళ్లు మమ్మల్ని అవమానించారు.. మిమ్మల్ని శాసించారు. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు. కానీ లవ్ మమ్మల్ని విడిచిపెట్టలేదు.. ఎంతో సహనం, ఎన్నో కష్టాలు, వదిలేయడానికి వేయి కారణాలు ఉన్నా మేము ప్రతిరోజు ఒకర్నొకరం కావాలనుకున్నాం. ఈ రోజు మేము భార్యాభర్తలం అని పోస్టు పెట్టింది ఫైమా.. దాంతో జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర సెలబ్రిటీలతోపాటు అటు అభిమానులు, నెటిజన్లు ఫైమా- ప్రవీణ్ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక జబర్దస్త్ లో ఫైమా- ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ వీరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. వాటికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.












Click it and Unblock the Notifications