విడాకులు తీసుకున్న మరో జంట...కన్నీరు పెట్టుకున్న హీరో
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. తాజాగా ఓ సీరియల్ నటుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్ నటుడు ప్రియతమ్ చరణ్ తన భార్య మానసకు విడాకులిచ్చారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

పలు సీరియల్స్‌లో హీరోగా నటించి ప్రియతమ్ చరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియతమ్ చరణ్..చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. సీరియల్ నటి మానసను ప్రియతమ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.ప్రియతమ్ చరణ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు.
ఆ వీడియోలో ఏముందంటే.. ప్రియతమ్ కబోర్డ్‌లో ఫొటో ఆల్బమ్ తీసి తన కొడుకులతో కలిసి ఉన్న ఫొటోలను చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. వారికి ముద్దులు కూడా పెట్టి ఫొటోలను గట్టిగా హత్తుకున్నాడు. అలాగే ప్రేమ అనేది నాకు, నా కొడుకులకు మధ్య ఒక వంతెన లాగా దూరం చేస్తుంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్లు అయినా నేను ప్రయాణిస్తా. దూరం అనేది బంధాలను విచ్ఛిన్నం చేయదు అంటూ రాసుకొచ్చాడు.
ఈ వీడియో చూసిన తరువాత ప్రియతమ్ విడాకులు తీసుకున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రియతమ్ ఎక్కడా కూడా తన భార్య గురించి మాట్లాడలేదు.అయితే విడాకుల వార్తలపై అటు ప్రియతమ్ కానీ.. ఇటు భార్య మానస కానీ ఎవరూ స్పందించలేదు.ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియడం లేదు.ప్రస్తుతం ప్రియతమ్-మానస విడాకులు వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications