హీరోయిన్‌ను అక్కడ గిల్లిన పోకిరి.. తర్వాత ఏం జరిగిందంటే..?
సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటే.. మరికొందరు నేరుగానే ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎంత సెక్యూరిటీ ఉన్న వారిని దాటుకుని వచ్చి మరీ తమ అభిమాన నటీ, నటులను కలవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు.
స్టార్స్ ఎలాంటి పరిస్థుతుల్లో ఉన్న వారితో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దీనిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు మనం చాలానే చూశాం.

ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన హీరోయిన్ కాజల్ ఆగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాజల్ దగ్గరకు వెళ్లి తన నడుము పట్టుకుని ఫొటో దిగడానికి ఓ ఆకతాయి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన కాజల్ ఏం చేస్తున్నావ్ అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. మలయాళ బ్యూటీ మంజు వారియర్‌కు చేదు ఘటన ఎదురైంది.
People 😡🙏 #ManjuWarrierpic.twitter.com/b2nfTau96B
— Prince in Exile || దారి తప్పిన బాటసారి.. .. .. (@ExilePrince_555) May 2, 2025
మంజు వారియర్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వెళ్లింది. హీరోయిన్ వస్తుందని భారీగా ప్రచారం చేయడంతో జనం పెద్ద సంఖ్యలో మాల్ దగ్గరకు వచ్చారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఆమె కారు వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు సడెన్‌గా తన నడుముని గిల్లారు. అంతేకాకుండా అసభ్యకరంగా తనపై చేతులు వేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications