ఆ పని కోసం హీరోయిన్‌కి అభిమాని రిక్వస్ట్ .. షాకింగ్ రిప్లై !
తమిళ హీరోయిన్ 'మాళవిక మోహనన్' గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గానే విక్రమ్ తో కలిసి తంగలాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటి వరకు స్ట్రెయిట్ తెలుగు ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వని ఈ భామ.. త్వరలోనే ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతోంది.
అటు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్.. సినిమా ముచ్చటలతో పాటే తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అయితే ఈ సెషన్ లో ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ అభిమాని. ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టాడు. అంతే కాకుండా మీరు కలలు కనే మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి ? ది బెస్ట్ హజ్బెండ్‌లా ఉండాలని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఇందుకు కూల్ గానే రెస్పాండ్ అయిన మాళవిక.. తాను ఇప్పుడు పెళ్లికి సిద్దంగా లేనని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు తనకు భర్త వద్దు అని కామెంట్ చేసింది. దీంతో వీడికడదరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే హాబీస్ ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. క్రికెటర్లలో ఎవరు ఫేవరెట్ అని మరొకరు అడగగా.. విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని తెలిపింది. తనను ఇంట్లో వాళ్లు, దగ్గరి వాళ్లు ఎక్కువగా మల్లు అని పిలుస్తారని కూడా వెల్లడించింది ఈ భామ.
But..I don’t want husband right now
— Malavika Mohanan (@MalavikaM_) March 11, 2025
ఇక మాళవిక మోహనన్ ప్రస్తుతం తెలుగులో రాజా సాబ్, తమిళంలో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఫన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్స్ లో ప్రభాస్ కనిపించి చాలా కాలమే అవుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిసన్నారు.












Click it and Unblock the Notifications