పెళ్లి చేసుకోను..కానీ పిల్లల్ని కంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యతను ఇస్తున్నారు. పెళ్లైన హీరోయిన్లు సైతం కెరీర్‌తో పాటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తుంటే..మరికొందరు తల్లులుగా మారిన తరువాత కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియ భట్ పెళ్లైన వెంటనే గర్భవతి అయింది. బిడ్డను కన్న తరువాత కూడా అలియా భట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార సైతం ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ హీరోయిన్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని కంటాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఈ బ్యూటీ అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా కెరీర్, పెళ్లి గురించి స్పందించింది. ఫరియా తనకు పెళ్లిపై హోప్ లేదు కానీ.. పిల్లలు మాత్రం కావాలంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'నా మ్యారేజ్ పైన నాకు హోప్ కూడా లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు. కానీ కచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదు. కానీ నాకు పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం. పెళ్లి చేసుకోకపోయిన పిల్లల్ని మాత్రం కంటానని చెప్పుకొచ్చింది. మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే నాకు కొంచెం భయం' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఫరియా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications