ఓటు వారికే వేయండి: దర్శకుడు బోయపాటి సంచలన వ్యాఖ్యలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. ఆయన సినిమాల్లో హీరో కళ్లకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్లు కనిపిస్తే చాలు.. ఆ అన్యాయానికి పాల్పడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి అనుచరులు నామరూపాలు లేకుండా పోతారు. ఒక్క దెబ్బకే వారిని హీరో భూమిలోకి పంపించేస్తాడు. తన మొదటి సినిమా నుంచి బోయపాటి హీరోల విషయంలో ఇదే సూత్రాన్ని పాటిస్తాడు. ఆయన సినిమాల్లో హీరో ఎంత సాహసిగా ఉంటాడో అనే విషయం తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు.
తాజాగా ఆయన గుంటూరుకు సమీపంలోని ఆర్ వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెక్నికల్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్స్ పోటీలలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రేపు జరగబోతున్న ఎన్నికల్లో యువత అంతా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలని, అలా అని మీ ఓటును కేవలం ఓటులా చూసే నాయకుడికి కాకుండా మీ భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడికి వేయాలని చెప్పారు. అలా ఓటు వేసినప్పుడే మనందరి భవిష్యత్తు బాగుండటం కోసం పనిచేసే నాయకుడు వస్తాడన్నారు. ప్రస్తుతం బోయపాటి చెప్పిన మాటలు హాట్ టాపిక్ గా మారడంతోపాటు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇంజనీర్లుగా ఎంత స్థాయికి ఎదిగినా జన్మనిచ్చిన తల్లిదండ్రులని మాత్రం వదలొద్దన్నారు. తాను కూడా ఆర్ వీఆర్ అండ్ జేసీలోనే చదివానని చెప్పారు. బోయపాటి ఇప్పటి వరకు తన కెరీర్ లో అన్నీ మాస్ సినిమాలే చేశారు. అంతేకాదు.. వాటిల్లో సామాజిక సందేశం కూడా ఉంటుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరో ఎవరు అనే విషయం మరికొద్దిరోజుల్లో తెలియబోతోంది.












Click it and Unblock the Notifications