భారీగా పెరిగిన రాజమౌళి ఆస్తుల విలువ
బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ సినిమా తీయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలుస్తోంది. ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు, హీరోలు క్యూ కడుతుంటారుకానీ ఎవరికి అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. తాను అనుకున్న స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాతే అన్ని వివరాలను రాజమౌళి ప్రకటిస్తుంటారు.
తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళి ఆస్తులకు సంబంధించి ఓ వార్త ఆసక్తిగా మారింది. సెలబ్రిటీల ఆస్తులు ఎంత? అనే విషయాన్ని చాలా సంస్థలు అంచనా వేసి చెబుతంటాయి. తాజాగా ఓ సంస్థ రాజమౌళి ఆస్తులను తెలిపింది. దాదాపు రూ.158 కోట్లకు పైనే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సొంతంగా కట్టుకున్న ఇంటితోపాటు నగరం చుట్టుపక్కల స్థలాలు, నల్గొండ శివారులో భారీ ఫామ్ హౌస్ ను కూడా సంపాదించుకున్నారు. అలాగే ఆయన దగ్గర బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. వీటి ధర కోటిన్నర రూపాయల వరకు ఉంటుంది.

బాహుమలి సినిమా తర్వాత తన పారితోషికాన్ని రాజమౌళి భారీగా పెంచారు. తన కుటుంబ సభ్యులందరినీ మూవీలో ఇన్ వాల్వ్ చేసి టీం మొత్తానికి ప్యాకేజీ తీసుకుంటారు. దీంతోపాటు లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా బడ్జెట్ రూ.1500 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే భారతదేశంలో అత్యంత భారీబడ్జెట్ తో తీయబోతున్న మొదటి సినిమా కూడా ఇదే అవుతుందని భావిస్తున్నారు. మహేష్ బాబుతో తీయబోతున్న సినిమాను పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయబోతున్నారు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు.












Click it and Unblock the Notifications