బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం..
గ్లోబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం స్పిరిట్'. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా " త్రిప్తి డిమ్రి " నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..
సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ఈ ప్రమాదంలో సెట్‌లోని టెంట్లు, కొన్ని ముఖ్యమైన షూటింగ్ సామాగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. అంతే కాకుండా చిత్ర యూనిట్ సహాయక బృందంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు వాపోతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా డార్లింగ్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈ ఘటనపై చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా సంక్రాంతి కానుకగా ప్రభాస్ "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది. అలానే న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో నిల్చొని ఉండగా.. త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రభాస్ మొదటిసాటి అంత రా అండ్ రస్టిక్ గా కనిపించడంతో ఆ ఫోటో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఈ చిత్రం 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications