యానిమల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రీలీజ్... అర్జున్ రెడ్డి రేంజ్‌లో...
యానిమల్ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'అమ్మాయి' అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పాట కాస్త అర్జున్ రెడ్డి రేంజ్‌లోనే ఉంది అంటున్నారు కొంతమంది నెటిజన్లు.. 'అర్జున్ రెడ్డి' మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొత్త సినిమాల నుంచి రిలికల్ సాంగ్స్ రిలీజ్ కావడం చూశాం. కానీ యానిమల్ సినిమా నుంచి మాత్రం ఏకంగా ఫుల్ వీడియో సాంగ్‌నే రిలీజ్ చేశారు.
ఓ రేంజ్‌లో రోమాన్స్ : ఈ పాటలో రణబీర్, రష్మికల మధ్య లిప్ లాక్ సీన్‌లే ఎక్కువగా ఉన్నాయి. మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్ అన్నీ టాప్ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రణ్‌బీర్‌ను తీసుకొచ్చి రష్మిక తన లవ్ గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో వాళ్ల ముందే ఇద్దరూ కిస్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఈ పాట మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లైట్ లో ఓ రేంజ్‌లో రోమాన్స్ సీన్లుంటాయి.

ఆ తర్వాత మంచుకొండపై ఉన్న ఓ చిన్న ఆలయంలో దండలు మార్చుకుని సింపుల్‌గా మ్యారేజ్ చేసుకుంటారు. ఈ సీన్స్ అన్నీ ఈ పాటలో చూపించారు. నింగి నేల నీలా నాలా అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట దాదాపు 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉంటుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తండ్రి పాత్రలో అనిల్‌కపూర్ : ఈ పాట చూస్తున్నంత సేపు అర్జున్‌రెడ్డి సినిమానే గుర్తుస్తోంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో లాగే ఇందులో కూడా ఎక్కువ కిస్ సీన్లే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఉన్నారు. రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకోనున్నారు. డిసెంబర్ 1న హిందీ, తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మూవీ మేకర్స్.












Click it and Unblock the Notifications