2025లో మొదటి ఫ్లాప్ సినిమా ఇదే..!
తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండగకు రిలీజయ్యే ఏ సినిమా అయినా మినిమమ్ గ్యారంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో 'డాకు మహారాజ్','సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'గేమ్ ఛేంజర్' మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.
మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సినిమాపై సగటు ప్రేక్షకులతో పాటు, మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్ అభిమానుల సహానానికి పెద్ద పరీక్షే అని చెప్పాలి.

దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్'ను నిర్మించారు. కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉన్నట్టు అనిపించడం లేదు. పైగా "డాకు మహారాజ్","సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు పెట్టిన పెట్టుబడిని రికవర్ చేసి లాభాల బాట పట్టాయి. 'గేమ్ ఛేంజర్' పరిస్థితి మాత్రం ఈ రెండు సినిమాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. 'గేమ్ ఛేంజర్' మొదటి వారం ముగిసే సమయానికి రూ. 117.65 కోట్లు వసూలు చేసింది.ఇప్పటి వరకు 'గేమ్ ఛేంజర్' మొత్తం కలెక్షన్స్ అన్ని భాషలలో కలిపి 126.36 కోట్లకు చేరుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను తెచ్చేలా కనిపిస్తోంది.అలాగే 2025లో తొలి ఫ్లాప్ అందించిన సినిమా కూడా "గేమ్ ఛేంజర్" నిలిచింది.












Click it and Unblock the Notifications