ఫిష్ వెంకట్ చివరి మెసేజ్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..!
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంత కాలంగా చికిత్స పొందుతూ ఇటీవల ఆయన కన్నుమూశారు. ఫిష్ వెంకట్ తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ పాత్రల్లో నటిస్తూ.. తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. అలా రోజుకు మూడు వేల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయి నుంచి రూ.30 వేలకు వెంకట్ ఎదిగారు ఫిష్ వెంకట్.
అయితే ఆయన మరణానంతరం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తన ఆరోగ్యం కోల్పోవడానికి గల కారణాలను వివరించారు. యువత భవిష్యత్తులో ఇలాంటివి చేసి జీవితాన్ని కోల్పోవద్దని సూచించారు. ఆయన చివరి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో గుట్కాలను అలవాటు చేసుకోకూడదని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు. గతంలో తాను రోజుకూ 30 నుంచి 40 గుట్కాలు తీసుకునేవాడినని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ వెల్లడించారు.
ఆ తర్వాత పాన్ మసాలాలు, మానిక్ చాంద్, పాన్ పరాక్, పాన్ మసాలాలు తిన్నాను. వీటిని తినడం వల్ల తనకు మాట కూడా సరిగ్గా వచ్చేది కాదన్నారు. దీనికి కారణం గుట్కాలేనని తెలిపారు. ఓ డాక్టర్ సూచనలతో వాటిని తినడం నెమ్మదిగా తగ్గించేశానని చెప్పారు. అలా రోజుకు 30 గుట్కాల నుంచి ఐదు గుట్కాల వరకు తగ్గించుకుంటూ వచ్చానని తెలిపారు. ఈ క్రమంలో గుట్కాలు ఎవరూ తినొద్దని ఫిష్ వెంకట్ సూచించారు.

ఇక ఫిష్ వెంకట్ హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు వందకు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఆదిలో తొడ కొట్టు చిన్నా డైలాగ్ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆది మూవీ తర్వాత వివి వినాయక్ సినిమాల్లో అత్యధికంగా కనిపించారు ఫిష్ వెంకట్. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, గబ్బర్ సింగ్ వంటి పలు హిట్ సినిమాల్లో ఆయన నటించారు.












Click it and Unblock the Notifications