చిన్న కూతురు కోసం.. మరోసారి అతిథి పాత్రలో తలైవా
వెండితెరపై అతిథిపాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సినిమాల్లో తమకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నవారు ఈ తరహా పాత్రల్లో మెరుస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. అలాగే, సినిమాలకు విరామం ఇచ్చే పెద్ద పెద్ద స్టార్‌ల రీఎండ్రీకి కూడా అతిథిపాత్రలు ఓ ఫ్లాట్‌ఫాంగా నిలుస్తాయి. అయితే, ఇటీవల కాలంలో సూపర్ స్టార్ హీరోలు సైతం ఈ తరహా మార్గంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రజనీకాంత్ ఈ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉన్నారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన లాల్ సలామ్ చిత్రంలో గెస్ట్‌రోల్‌లో రజినీ తనదైన స్టయిల్‌లో మెప్పించారని ఇప్పటికే టాక్. ఈ సినిమాలో రజినీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ నటించారు. తాజాగా చిన్నకూతురు కోసం మరోసారి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
గెస్ట్ రోల్ సినిమాకు కలిసొచ్చిందా : తమిళనాడు సహా లాల్ సలామ్ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ మోయిదీన్ భాయ్ అతిథి పాత్రలో తలుక్కుమన్నారు. ఇక, లాల్ సలామ్ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ విడుదలైన మొదటిరోజైతే మాత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోసారి అతిథిపాత్రలో తలైవా : ఇప్పటికే లాల్ సలామ్‌లో తన పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ కోసం గెస్ట్ రోలో సందడి చేసిన రజినీ.. తాజాగా చిన్న కూతురు కోసం మేకప్ మేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ తర్వాతి సినిమాలో అతిథిపాత్రలో కనిపించేందుకు రంగం సిద్ధం చేశారని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాదు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని, నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోడంతో తలైవా అభిమానులు ఆ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications