లోక్ సభ ఎన్నికలకు స్టార్ హీరో ప్రచారం ? మోదీ చేతుల్లో ఉంది, మాదేముంది, మాజీ సీఎం క్లారిటీ !
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన అభినవ చక్రవర్తి, బహుబాష నటుడు కిచ్చా సుదీప్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారా ? అనే ప్రశ్న ఆ రాష్ట్ర రాజకీయాల్లో తలెత్తింది. మంగళవారం హావేరిలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ హీరో సుదీప్ విషయంలో క్లారిటీ ఇచ్చారు
సినీ రంగం నుంచి ఇప్పటికీ ఎవరైనా ఎన్నికల ప్రచారం కోసం వస్తారన్న విషయం తెలీలేదని మాజీ సీఎం బసరాజ్ బోమ్మయ్ అన్నారు. అంతా పార్టీ హైకమండ్ నిర్ణయిస్తుందని, లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వచ్చే స్టార్ క్యాంపెయినర్లతో చర్చలు సాగుతున్నాయని, స్టార్ క్యాంపెయినర్లను పార్టీ నిర్ణయిస్తుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఈ విషయంలో బీజేపీకి అంతా మంచి జరుగుతుందని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు

అనేక నియోజకవర్గాల్లో అధికార బీజేపీ అభ్యర్థులను మార్చాలని సొంత పార్టీలోని కొందరు నాయకులు ఒత్తిడి చేయడంపై అడిగిన ప్రశ్నకు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పందిస్తూ 'ప్రస్తుతం కొప్పల్ ఎంపీ కారడి సంగన్నతో మాట్లాడానని, ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని అంగీకరించారని, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఈరోజు దావణగెరె వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతారని, దావణగెరె ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు,
మాజీ సీఎం యడ్యూరప్ప బుధవారం బెళగావి వెళతారని, అక్కడ కూడా అన్ని సర్దుకుంటాయని, రానున్న రోజుల్లో అంతా బాగానే ఉంటుందని అనుకుంటున్నానని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ వివరించారు. బెంగళూరు నార్త్ లోక్‌సభ నియోజకవర్గంలో శోభా కరంద్లాజేకు మద్దతివ్వబోమని బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ చేసిన ప్రకటనపై స్పందించేందుకు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ నిరాకరించారు.
ఇలాంటి పుకార్లపై తాను స్పందించబోనని, సోమశేఖర్ నిర్ణయంపై తాను తరువాత స్పందిస్తానని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. మొత్తం మీద కర్ణాటకలో బీజేపీ తరుపున సినీ రంగం నుంచి ఎవరెవరు ఎన్నికల ప్రచారం చేస్తారు అనే విషయంలో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇవ్వకపోవడంతో హీరో సుదీప్ తో పాటు మరో హీరో దర్శన్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications