దళపతి కొత్త పార్టీ, సముద్రంలో మునిగేది ఎవరో తెలుస్తుంది కదా ?, ఎంత మంది వచ్చిపోలేదు !
తమిళ నటుడు దళపతి విజయ్ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం అనే కొత్త పార్టీని ప్రారంభించాడు, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత, మాజీ మంత్రి జయకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత కొంత కాలంగా దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయ్ రాజకీయ నాయకుల జాబితాలో చేరారు. తమిళ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల్లో ముఖ్యమైన వాళ్లు ఎంజీఆర్, జయలలిత, టీఆర్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, సీమాన్ ఇలా ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కొందరే రాజకీయాల్లో పట్టు సాధించారు. విజయ్ ఏం చేయబోతున్నాడో కాలమే చెప్పాలి అని ప్రజలు అంటున్నారు.

రాజకీయాలకు సంబంధించి దళపతి విజయ్ చేసిన ప్రకటనను ముఖ్యమైన రాజకీయ నాయకులు అందరూ గమనించారు. విజయ్ చేసిన ప్రకటన వెనుక చాలా ప్లాన్ ఉందని రాజకీయ నాయకులు కొందరు అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు, పాలనాపరమైన అవకతవకలు, అవినీతి రాజకీయ సంస్కృతి అయ్యిందని, ప్రజలను కుల,మత ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నారని హీరో విజయ్ ఆరోపించారు.
విభజన రాజకీయ సంస్కృతి మనకు రెండు వైపులా ఉన్నాయి, ఐక్యత, పురోగతికి అడ్డంకులు చాలా ఉన్నాయని హీరో విజయ్ ఆరోపించారు. హీరో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపాయి. నిస్వార్థ, పారదర్శకంగా, కుల, మతాలకు అతీతంగా, అవినీతి రహిత సమర్ధవంతమైన పరిపాలనకు దారితీసే ప్రాథమిక రాజకీయ మార్పు కోసం తమిళనాడులో చాలా మంది ఎదురు చూస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్ కొత్త పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
విజయ్ కొత్త రాజకీయ పార్టీ విషయంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జయకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి విజయ్ కుమార్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు, కేవలం 10 మందితో కలిసి కూడా రాజకీయ పార్టీ పెట్టవచ్చు, వాళ్లతో మాకు ఎలాంటి అభిప్రాయభేదాలు లేవు, రాజకీయం ఓ సముద్రం, రాజకీయాల్లాంటి సముద్రంలో దిగితే కదా దాని లోతు లెలిసేది, సముద్రంలో ఈత కొట్టేవాళ్లు కూడా ఉన్నారని, మునిగిపోయే వాళ్లు కూడా ఉన్నారని మాజీ మంత్రి విజయ్ కుమార్ అన్నారు.

ఈ మహాసముద్రం లాంటి రాజకీయాల్లో మునిగిపోయే వారు ఉన్నారా లేదా అని ప్రజలే గమనిస్తారని మాజీ మంత్రి విజయ్ కుమార్ చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ సముద్రంలో దిగాడని, ఆయన మునిగిపోతాడో లేక ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతాడో ఎన్నికల్లో చూడాలని, ఎవరైనా పార్టీ పెట్టవచ్చుని, కానీ ఇక్కడ ప్రజలే నిర్ణేతలు అని మాజీ మంత్రి విజయ్ కుమార్ చెప్పారు. అయితే విజయ్ కొత్త పార్టీ ప్రకటించిన రోజే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని టార్గెట్ చేశారని వెలుగు చూడటంతో ఆ పార్టీ నాయకులు ఆచితూచి అడుగులు వెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications