రోజా లవ్ స్టోరీకి 34 ఏళ్లు..సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు భయ్యా
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను ఏ రంగంలో ఉన్నా అంకితభావంతో పని చేయడం ఆమెకు ఉన్న అలవాటు. అటు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఇటు రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేయగలిగారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవడంతో పాటు, మంత్రి కూడా పని చేసిన అనుభవం ఆమె సొంతం. అయితే రోజా పెళ్లి విచిత్రంగా జరిగింది. ప్రశాంత్ హీరోగా, రోజా హీరోయిన్‌గా 34 ఏళ్ల క్రితం "చామంతి" సినిమా విడుదలైంది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇదే సినిమాకు రోజా భర్త సెల్వమణి దర్శకుడిగా పని చేశారు. షూటింగ్ సమయంలోనే రోజాను ఇష్టపడ్డారు సెల్వమణి. రోజా ప్రవర్తన, నడవడిక చూసిన సెల్వమణి, తన జీవిత భాగస్వామిగా రోజానే సరైన మనిషిగా ఆయన భావించారు. దీంతో ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టారు.అయితే ఈ విషయాన్ని తొలుత రోజా కంటే ముందు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు సెల్వమణి. ఆ తర్వాత రోజాకు అసలు విషయాన్ని తెలియజేశారాయన.వారి అంగీకారం కోసం సుమారు 11ఏళ్లు ఎదురు చూశారు. రోజా , సెల్వమణి వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. దీనివల్ల వారి వివాహం విషయంలో రోజా కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అని సెల్వమణి కొంత ఆందోళన చెందారు. సెల్వమణి రోజాను వివాహం చేసుకోవడానికి దాదాపు 11 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది.

రోజా అప్పటికే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తన కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకునే వరకు సెల్వమణి ఓపికగా ఎదురు చూశారు.చివరికి, రోజా తల్లిదండ్రులు సెల్వమణిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. వేర్వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ వారి ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించడం విశేషం. రోజా, సెల్వమణి 2002 ఆగస్టు 21న వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఒక కుమార్తె అన్షు మాలిక , ఒక కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.రోజా , సెల్వమణిలది ఒకరిపై ఒకరికి ఉన్న బలమైన ప్రేమ , గౌరవానికి నిదర్శనం. సెల్వమణి రోజా కోసం అన్నేళ్లు ఎదురు చూడటం, రోజా కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడం వారి బంధాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ప్రస్తుతం వారు సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు. రోజా, సెల్వమణిలను కలిపిన సినిమా చామంతి. ఈ సినిమా విడుదలై 33 ఏళ్లు అయింది. అంటే రోజా, సెల్వమణి లవ్ స్టోరీ 34 ఏళ్లు పూర్తి చేసుకుంది.












Click it and Unblock the Notifications