నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురి అరెస్టు...
ఇటీవల కాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే టార్గెట్ చేసి కొందరు డీప్ ఫేక్ వీడియోలను సృష్టించారు. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ హాల్చల్ చేశాయి. నిన్న మొన్నటి వరకు రష్మికకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలు కూడా వచ్చాయి. ఈ డీప్ ఫేక్ వీడియోల విషయాన్ని ప్రభుత్వం కాస్త సీరియస్‌గానే తీసుకుంది. దానికి బాధ్యులైన వానికి వెంటనే పట్టుకోవాలని అధికారులను కూడా ఆదేశించింది.
రష్మిక వీడియోపై పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. రష్మిక కూడా ఈవిషయంపై స్పందించింది. ఏఐ సాయంతో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను నెట్టంట వదిలారు. నటి రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. ఇలాంటి వీడియోస్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేశారు..

Delhi Police say it has tracked down four suspects, who turned out to be uploaders, not the creators, involved in the case of deep fake profiles of actor Rashmika Mandana. Police are looking are the key conspirator in the case.
— ANI (@ANI) December 20, 2023
కీలక సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నపోలీసులు...
దీంతో రష్మిక డీప్ ఫేక్ వీడియో విషయాన్నిపోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ పోలీసులు రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసుల కీలక పాత్ర వహించిన వ్యక్తి మాత్రం దొరకలేదు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, రష్మిక మందన్నా నటించిన యానిమల్ చిత్రం ఇటీవలే విడుదలయ్యే భారీ వసూళ్లనే రాబట్టింది. ఇక, రష్మిక చేతిలో ప్రస్తుతం పుప్ప2, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలున్నాయి. సోషల్‌మీడియాలోనూ కూడా నేషనల్ క్రష్ తెగ యాక్టివ్‌గా ఉంటుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications