ఆగస్టు 15 విన్నర్ ఆ సినిమానే..!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలో నాలుగు సినిమాలు సందడి చేశాయి.మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ , ఆయ్, వంటి తెలుగు సినిమాలతో పాటు తంగలాన్ తమిళ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్వాతంత్ర దినోత్సవంతో పాటు, వీకెండ్, రాఖీ పౌర్ణమి కూడా వరుసగా రావడంతో లాంగ్ లీవ్ దొరికింది. దీంతో సినీ అభిమానులకు కనుల పండుగే అని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ నాలుగు సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు. ఒక్కసారి ఈ నాలుగు సినిమాల గురించి చర్చించుకుంటే..
మిస్టర్ బచ్చన్
మాస్‌రాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ శంకర్
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో హీరోగా రామ్ నటించారు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. . ఇస్మార్ట్ శంకర్ కథనే అటు తిప్పి, ఇటు తిప్పి తీశారంటూ విమర్శలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ పని అయిపోయిందంటూ నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
తంగలాన్
చియాన్ విక్రమ్, పా. రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే తంగలాన్. బ్రిటిష్ కాలంలో బంగార గనుల తవ్వకాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగం బాగానే ఉన్నప్పటికి , సెంకడాఫ్‌లో సినిమా సాగదీశారనే విమర్శలు ఈ సినిమాపై వస్తున్నాయి. విక్రమ్ నటన బాగున్నప్పటికి కథను సరైన విధంగా చూపించలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆయ్
ఇక ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు చిన్న సినిమాగా వచ్చిందే ఆయ్. ఎన్టీఆర్ బామర్ది నార్నె నవీన్ హీరోగా తెరకెక్కిన సినిమానే నార్నె ఆయ్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. గోదావరి జిల్లాలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. అల్లు ప్రొడక్షన్ నుంచి రావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.ఓవరాల్‌గా ఆయ్ అనే చిన్న సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్ విన్నర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications