'మా పెళ్లికి ఆ హీరోనే కారణం'.. వీళ్ల లవ్ స్టోరీ ట్విస్టుల మీద ట్విస్టులు..
ప్రస్తుతం కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లో అన్ని భాషల్లో కలిపి వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే రూ. 410 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా నటించిన రిషబ్ శెట్టి.. చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. చాలా మంది వీఐపీలు కాంతార సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. అలాగే రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రగతి శెట్టి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని ఆమె గురించి నెట్టింట వెతుకుతున్నారు నెటిజెన్లు. అయితే వీరి ప్రేమ, పెళ్లిలో అనేక ట్విస్టులు జరిగినట్లు సమాచారం.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఆయన భార్య ప్రగతి శెట్టిల కృషి ఫలితమే కాంతార సినిమా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. అయితే వీరిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి చర్చలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిషబ్ భార్య ప్రగతి శెట్టి సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. కాంతార చాప్టర్ 1 మూవీలో రాజుల దుస్తులను ప్రగతి డిజైన్ చేశారు. రిషబ్ తో ప్రేమ గురించి ప్రగతి శెట్టి మాట్లాడిన ఓల్డ్ ఇంటర్వ్యూలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ప్రగతి ఓసారి తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్లారు. రిక్కీ అనే మూవీకి వెళ్లగా.. అక్కడ రిక్కీ మూవీ హీరో రక్షిత్ శెట్టితో ఫ్యాన్స్ సెల్ఫీలు దిగుతున్నారు. రక్షిత్ పక్కన రిషబ్ నిల్చొని ఉన్నాడు. అయితే మా ఫ్రెండ్ ఒకరు రిషబ్ ను చూపిస్తూ, అతనే ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పాడు. అప్పుడు నేను, నా ఫ్రెండ్స్ రిషబ్ తో సెల్ఫీలు తీసుకున్నాం. అలా మాట్లాడుతుండగా.. ఇద్దరం ఒకే ఊరు వాళ్లమని తెలిసింది. ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా స్నేహం పెరిగింది. అలా ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. స్నేహం.. ప్రేమగా మారింది.

అయితే వీరిద్దరూ లవ్ లో ఉన్నప్పుడు రిషబ్ శెట్టి సినిమాల్లో ఇంకా నిలదొక్కుకోలేదు. దాంతో రిషబ్ ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి పేరెంట్స్ దీనికి ఒప్పుకోలేదు. అయితే.. ప్రగతి పట్టు వీడలేదు. అయినా అతి కష్టం మీద వారిని ఒప్పించింది ప్రగతి. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications