ఓటీటీలోకి రష్మిక బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నేషనల్ క్రష్ రష్మిక మందాన్న వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది కుబేర సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకుంది. అయితే రష్మిక మందాన్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్' ఓటీటీలోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న తాజా మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమాలో రష్మికతోపాటు మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ నటించింది. అయితే ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' లో గురువారం అనగా డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. భూమా దేవి(రష్మిక) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) తో ప్రేమలో పడుతుంది. కానీ.. విక్రమ్ ను ఫస్ట్ ఇయర్ నుంచి దుర్గ (అను ఇమ్మాన్యుయెల్) ఇష్టపడుతుంది. ఈ క్రమంలో భూమా తన ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది..? విక్రమ్ అతి ప్రేమ వల్ల ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటి..? విక్రమ్ ప్రేమను పొందేందుకు దుర్గ ఏం చేసింది..? చివరికి భూమా విక్రమ్ ల లవ్ ఫలించిందా..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' లో డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.












Click it and Unblock the Notifications