'మురారి'ని టచ్ చేయలేకపోయిన 'గబ్బర్ సింగ్'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాడు ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేయడం అనవాయితీగా వస్తోంది. ఈసారి ఆయన పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా మార్చారు అభిమానులు. జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో అభిమానులు పవన్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్‌ను రీ-రిలీజ్ చేశారు.
Top Re Release Collections in Australia :#Murari4k - A$ 18,473 (ATR) #Simhadri4K - ,164#GabbarSingh4K - A,683
— Hemanth Kiara (@ursHemanthRKO) September 3, 2024
Gabbar Singh Failed to Beat Murari and Simhadri @urstrulyMahesh Still Holds Australia Re Release All Time Record 🔥 pic.twitter.com/ltHrIyegQI
పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే గబ్బర్ సింగ్ బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచింది. ఖుషి తర్వాత 10 ఏళ్ల పాటు హిట్ లేని పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు కోలాహలం కనిపించింది. థియేటర్ల దగ్గర అభిమానులు సందడి చేశారు. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్‌తో రికార్డులన్నీ బ్రేక్ చేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీ-రిలీజ్ కలెక్షన్లను గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుందనుకున్నారు. అయితే రీ-రిలీజ్‌లో మాత్రం గబ్బర్ సింగ్ తేలిపోయినట్టు కనిపిస్తోంది.

మురారి రీ-రిలీజ్ మొదటి రోజు ఐదున్నర కోట్లకుపైగానే కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే గబ్బర్ సింగ్‌కు మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా నలుగున్నర నుంచి ఐ కోట్ల వరకు వసూలు చేసి ఉండవచ్చని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఇక బుక్ మై షోలో కూడా గబ్బర్ సింగ్ కన్నా మురారి ముందు వరుసలో ఉంది.
#GabbarSingh4K 𝐒𝐄𝐓𝐓𝐋𝐄𝐒 𝐀𝐓 𝟓.𝟐𝐂𝐑 𝐎𝐏𝐄𝐍𝐈𝐍𝐆 (𝐒𝐄𝐏𝟏 + 𝐒𝐄𝐏𝟐) 💥🔥👌 - TOP3
— ★ Movie Monster ★ (@movie_monsterz) September 3, 2024
𝐖𝐇𝐈𝐋𝐄 𝐒𝐔𝐏𝐄𝐑 🌟#MaheshBabu's #Murari4K (5.45Cr) and #Businessman4K (5.32Cr) 𝐀𝐑𝐄 𝐒𝐓𝐈𝐋𝐋 𝐀𝐓 𝐓𝐎𝐏𝟏 & 𝐓𝐎𝐏𝟐 💥🔥👌
💥 💥 𝐒𝐔𝐏𝐄𝐑 𝐏𝐎𝐖𝐄𝐑 𝐒𝐓𝐎𝐑𝐌 💥 💥 pic.twitter.com/YoMoFT0Nir
గబ్బర్ సింగ్ సినిమాకు 125K టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ మురారీ సినిమాకు 161K టికెట్లు అమ్ముడు పోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. భారీ వర్షాల ఎఫెక్ట్ గబ్బర్ సింగ్‌పై గట్టిగానే పడినట్టు కనిపిస్తోంది. దీంతో రీ-రిలీజ్ సినిమాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావించిన గబ్బర్ సింగ్, నార్మల్‌గానే కలెక్షన్లు సాధించడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications