'గేమ్ ఛేంజర్' రెండో రోజు మరీ దారుణంగా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.కథ, కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెబుతున్నారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.

కథ బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు. మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు.

Game changer collection that fell heavily on the second day

ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా తెలిపింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'గేమ్‌ ఛేంజర్‌' నిలిచింది. అయితే ఈ కలెక్షన్లపై కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం, గేమ్ ఛేంజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు 85 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.

పలు ప్రాంతాల నుండి అందిన డేటా ప్రకారం..సీడెడ్ ఏరియా గ్రాస్ 7.6 కోట్లు, తమిళనాడు గ్రాస్ 2.5 కోట్లు, గుంటూరు షేర్ 3.7 కోట్లు కాగా, పశ్చిమ గోదావరి 2.05 కోట్లు (హైర్స్‌తో కలిపి) వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఓవర్సీస్ కు సంబంధించిన లెక్కలు కూడా కలుపుకుని సుమారు 85 కోట్ల వరకు చేరినట్లు చెబుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం సినిమా ఏకంగా రూ.186 కోట్లు వసుళ్లు చేసినట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.అంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగానే తేడా కనిపిస్తోంది.

నెగిటివ్ టాక్ రావడంతో గేమ్ ఛేంజర్ పరిస్థితి రెండో రోజు మరింత దారుణంగా మారింది.బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్‌లో వచ్చిన డేటా చూస్తే, ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా తగ్గుతున్నట్టే కనిపిస్తోంది.హైదరాబాద్‌లో రెండవ రోజు 908 షోల కోసం రూ. 2.4 కోట్ల మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి, ఏకంగా 24.5% ఆక్యుపెన్సీతో. మొదటి రోజుకి పోలిస్తే ఇది చాలా తక్కువ. బెంగళూరులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 703 షోల కోసం కేవలం 70 లక్షల బుకింగ్స్ మాత్రమే నమోదైయ్యాయి, ఆక్యుపెన్సీ 10.1% మాత్రమే.

ఈ నగరాల్లో ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం సినిమా టాక్‌పై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది.రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ డేటా చూస్తే, గేమ్ ఛేంజర్ ఓవర్ఆల్ గ్రాస్ రాబడిలో పడిపోయే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండో రోజు ఈ సినిమా కేవలం రూ.21.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు ట్రెడ్ వర్గాలు తెలిపాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సినిమాకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

గేమ్ ఛేంజర్ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్
హైదరాబాద్: ₹2.4 కోట్లు - 908 షోలు (24.5% ఆక్యుపెన్సీ)
బెంగళూరు: ₹70 లక్షలు - 703 షోలు (10.1% ఆక్యుపెన్సీ)
విశాఖపట్నం: ₹73 లక్షలు - 253 షోలు (30% ఆక్యుపెన్సీ)
విజయవాడ: ₹35 లక్షలు - 169 షోలు (19.8% ఆక్యుపెన్సీ)
గుంటూరు: ₹10 లక్షలు - 42 షోలు (40.5% ఆక్యుపెన్సీ)
ఒంగోలు: ₹8 లక్షలు - 33 షోలు (15.6% ఆక్యుపెన్సీ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+