'పుష్ప-2' దరిదాపుల్లో లేని 'గేమ్ ఛేంజర్'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే సినిమాకు మొదటి నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు. బజ్ క్రియేట్ చేయడంలో 'గేమ్ ఛేంజర్' బాగా వెనుకపడింది. ఇదే సమయంలో సినిమాలోని ట్రైలర్, పాటలు, పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించలేదు. ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కథ, కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా మొదటి రోజు కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.వరల్డ్​వైడ్​గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా తెలిపింది. మరోవైపు ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో 'గేమ్‌ ఛేంజర్‌'కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'గేమ్‌ ఛేంజర్‌' నిలిచింది.

game changer movie first day worldwide collection

కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను బీట్ చేయడంలో 'గేమ్‌ ఛేంజర్‌' వెనుకపడింది. పుష్పా-2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టించింది. అయితే గేమ్ ఛేంజర్ సినిమా పుష్ప-2 రికార్డును బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ పుష్పా-2 కంటే రూ.100 కోట్లు తక్కువ స్థాయిలోనే కలెక్షన్లు నమోదు అయ్యాయి. పుష్ప-2ని (రూ.294 కోట్లు) బీట్ చేసే స్థాయిలో కలెక్షన్లు వస్తాయనుకుంటే రూ. 100 కోట్లకు పైగా తేడాతో రూ.186 కోట్లకే గేమ్ ఛేంజర్ పరిమితమైందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.తొలి రోజు కలెక్షన్లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అల్లు అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+