'గేమ్ ఛేంజర్'కు మరో బిగ్ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్వకత్వం వహించగా, దిల్ రాజు రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్'ను నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది.
ముఖ్యంగా సెకండాఫ్ తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు. తమన్ ఇచ్చిన పాటలు, బీజీఎమ్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు మా హీరో జీవితాన్ని నాశనం చేశారంటూ మెగా ఫ్యాన్స్ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు.రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా 'గేమ్ ఛేంజర్'కు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ సినిమా విడుదలై 24 గంటలు కాకుండానే 'గేమ్ ఛేంజర్' హెచ్‌డీ ప్రింట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు.మెగా ఫ్యాన్స్ మాత్రం సినిమాను థియేటర్లలోనే చూడండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.












Click it and Unblock the Notifications