ప్రయాణికులకు బంపర్ ఆఫర్..బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ఫుల్ మూవీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించారు.

అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు. తమన్ ఇచ్చిన పాటలు, బీజీఎమ్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Game Changer movie was screened in private buses

రెండు సంవత్సరాల పాటు మా హీరో జీవితాన్ని నాశనం చేశారంటూ మెగా ఫ్యాన్స్ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు.రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు.సినిమా విడుదలై 24 గంటలు కాకుండానే 'గేమ్ ఛేంజర్‌' హెచ్‌డీ ప్రింట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తాజాగా ఈ సినిమాను 'గేమ్ ఛేంజర్' సినిమాను ప్రైవేటు బస్సుల యాజమానులు తమ బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేసిన వారికి ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో గేమ్ ఛేంజర్ సినిమాను ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు తన సోషల్ మీడియాలో బయటపెట్టాడు. సంక్రాంతికి టికెట్ ధర రూ.5000 అంటే ఎందుకో అనుకున్నా, గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నట్టుగా సదరు ప్రయాణికుడు రియాక్ట్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+