‘గాంధీ టాక్స్’ రివ్యూ: మనసును గెలిచే సినిమా

సింగీతం శ్రీనివాసరావు గారి 'పుష్పక విమానం' ఒక చరిత్ర. కమల్ హాసన్ నటన, మాటలు లేని ఆ మాయాజాలం అప్పట్లో ఒక సంచలనం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, శబ్దాల సందడిలో నిశ్శబ్దానికి ప్రాణం పోస్తూ వచ్చిన సినిమా 'గాంధీ టాక్స్' . విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి దిగ్గజ నటులు ఉన్న ఈ 'మూకీ' సినిమా మూవీ ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ

మహాదేవ్ (విజయ్ సేతుపతి) మన మధ్య తిరిగే ఒక సామాన్య యువకుడు. చదువు ఉంది కానీ ఉద్యోగం లేదు. అనారోగ్యంతో ఉన్న తల్లి, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే ప్రియురాలు గాయత్రి (అదితి రావ్ హైదరి).. వీటన్నిటికీ పరిష్కారం డబ్బు. మరోవైపు బోస్‌మన్ (అరవింద్ స్వామి) ఒకప్పుడు పెద్ద బిల్డర్. ఇప్పుడు అంతా కోల్పోయి ఒంటరివాడైన ధనవంతుడు. డబ్బు లేని పేదరికం, డబ్బు పోయిన ధనిక లోకం.. ఈ రెండు ప్రపంచాలు ఒకే ప్లాన్‌తో ఎలా కలిశాయి? గాంధీ బొమ్మ ఉన్న నోట్ల కోసం మనిషి తన నిజాయితీని ఎలా పణంగా పెడతాడు? అనేదే ఈ సినిమా.

Gandhi Talks Telugu Movie Review Vijay Sethupathi Arvind Swamy Aditi Rao Steals the show

నటీనటుల అభినయం

విజయ్ సేతుపతి: ఈ సినిమాను తన భుజాల మీద మోశాడు. డైలాగ్స్ లేకపోయినా తన కళ్లతోనే నిరాశను, గిల్ట్‌ను పండించాడు. ఒక సీన్‌లో దొంగతనానికి వెళ్లే ముందు చెప్పులు విడిచి వెళ్లడం.. అతనిలోని సంస్కారాన్ని, నిజాయితీని ఎంత గొప్పగా చూపించిందో.అరవింద్ స్వామి ధనవంతుడి ఒంటరితనాన్ని తన బాడీ లాంగ్వేజ్‌తో అద్భుతంగా పలికించాడు.సిద్ధార్థ్ జాదవ్ సెకండాఫ్‌లో తన కామెడీ టైమింగ్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు.అదితి రావ్ హైదరి తన సహజ సిద్ధమైన అందంతో, నటనతో గాయత్రి పాత్రకు ప్రాణం పోసింది.

టెక్నికల్ వండర్

ఈ సినిమాకు అసలైన హీరో ఏ.ఆర్. రెహమాన్. మాటలు లేని చోట సంగీతమే మాట్లాడాలి. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ప్రతి ఎమోషన్‌ను నేరుగా గుండెకు తాకేలా చేశాయి. ముంబై ఛావ్ల్‌లను, స్కైస్క్రేపర్లను చూపించిన సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది.

విశ్లేషణ

డైరెక్టర్ కిశోర్ బెలేకర్ ఒక రిస్కీ ప్రయోగం చేశాడు. అక్కడక్కడా కథనం నెమ్మదించినా, క్లైమాక్స్ ఇచ్చే ఫీల్ ఆ లోటును భర్తీ చేస్తుంది. ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. కానీ సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక 'మిర్రర్'. డబ్బు వెనక పరుగులు తీసే ఈ కాలంలో, మనుషుల విలువల గురించి నిశ్శబ్దంగా ప్రశ్నిస్తుంది ఈ 'గాంధీ టాక్స్'. ముంబై మహానగరంలోని ఇరుకైన ఛావ్ల్‌ల నుంచి ఆకాశాన్ని తాకే బిల్డింగ్‌ల వరకు.. మనిషిని నడిపించేది, మార్చేది ఒక్కటే.. అదే 'డబ్బు'. ఈ పాయింట్‌ను ఎంచుకుని, ఏ డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతో కథను నడిపించడం ఒక సాహసమే.

ఫైనల్‌గా

'గాంధీ టాక్స్' - మాటల్లేవు.. కానీ మౌనంతోనే మనసును గెలిచే సినిమా.

రేటింగ్
2.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+