మన ఇంట్లో కూడా మదర్స్ ఉంటారు కదా..హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ ఆగ్రహం
బుల్లితెరపై హైపర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు.
జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది చేసిన పనికి గణేష్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గణేష్ మాస్టర్ ప్రస్తుతం ఢీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.దీనిలో భాగంగానే చిరంజీవి అల్లుడా మజాకా చిత్రంలోని అత్తో అత్తమ్మ కూతురో అనే సాంగ్‌కి డ్యాన్సర్లు పెర్ఫామ్ చేశారు. అయితే ఈ సాంగ్‌లో తల్లి వయస్సున్న ఆమెతో అసభ్యకరంగా డ్యాన్స్ వేయించడంపై గణేష్ మాస్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..
యాపిల్ పెట్టుకుని డ్యాన్స్ చేయండి.. కానీ మార్చుకోవడం ఎందుకు.. మన ఇంట్లో కూడా మదర్స్ ఉన్నారు కదా.. ఎంత అసభ్యంగా ఉంటుంది.. ఇది డ్యాన్స్ షో.. జోక్ కాదు. ఇంకొకసారి ఇలాంటి పెర్ఫామెన్స్ ఇస్తే అసలు మార్కులే ఇవ్వను అంటూ సదరు డ్యాన్స్ మాస్టర్‌కు వార్నింగ్ ఇస్తారు. అయితే దీనిపై హైపర్ ఆది కామెడీ చేయడంతో గణేష్ మాస్టర్ అసహనం వ్యక్తం చేశారు.
హైపర్ ఆది ఫన్నీగా గణేష్ మాస్టర్‌ని ఇమిటేట్ చేశాడు. దీంతో హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు. నేను చెప్పింది రైటా రాంగా అని హైపర్ ఆదిని గణేష్ మాస్టర్ ప్రశ్నించారు.యాపిల్ సీక్వెన్స్ మాత్రం తప్పని హైపర్ ఆది ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు దీనిపై ఎలా కామెడీ చేస్తారని హైపర్ ఆదిపై గణేష్ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications