బిగ్ బాస్ విన్నర్ విషయంలో బిగ్ ట్విస్ట్.. విన్నర్ అతనే..?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ముగింపు దశలకు చేరుకుంది. మరి కొద్ది గంటల్లో బిగ్‌బాస్ 8వ సీజన్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకున్నారు.యష్మీ గౌడ, నిఖిల్,అభియ్ నవీన్,ప్రేరణ, హీరో ఆదిత్య ఓం,సోనియా ఆకుల, బెజవాడ బేబక్క,ఆర్‌జే శేఖర్ భాషా,7ఆర్ట్స్ సీత,నాగ మణికంఠ,పృద్వీరాజ్, విష్ణు ప్రియ,డాన్సర్ నైనిక, నబీల్ అఫ్రిది ఈ సీజన్‌లో కంటెస్టెంటులుగా అడుగుపెట్టారు.

వీరితోపాటు ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీతో పాత కంటెస్టెంట్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చి బిగ్‌బాస్ బిగ్ ట్విస్టే ఇచ్చాడు.మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు.సీజన్ చివరి దశకు చేరుకునే సరికి టాప్-5లో అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిది,నిఖిల్,ప్రేరణ నిలిచారు. వీరిలో నిఖిల్ , గౌతమ్ కృష్ణలు ఫైనల్‌కు చేరినట్టు సమాచారం అందుతోంది. ఆటతీరుతో కాకుండానే ఓట్ల విషయంలో కూడా వీరిద్దరు గట్టిగానే పోటీపడ్డారు. సీజన్ మొదటి నుంచి కూడా నిఖిల్ విన్నర్ అవుతారని అంతా భావించారు.

Gautham Krishna Telugu Bigg Boss winner is being promoted

కానీ గౌతమ్ కృష్ణ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హోస్‌లో అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ తన ఆటతో అందర్ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తనదైన పవర్‌పుల్ గేమ్‌తో టైటిల్ రేసులోకి దూసుకువచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ కృష్ణనే బిగ్‌బాస్ 8వ సీజన్ విన్నర్‌గా నిలిచినట్టు తెలుస్తోంది. నిఖిల్ కంటే ఓట్లు అధికంగా గౌతమ్ కృష్ణకే రావడంతో అతని టైటిల్ గెలిచినట్టు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి గంటల తర్వాత కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే గౌతమ్ కృష్ణనే విన్నర్ అని ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+