అలాంటి పాత్రల కోసం ఆ పనికి కూడా సిద్ధమే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
'బాయ్స్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ జెనీలియా.. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. 2003లో వచ్చిన 'బాయ్స్' సినిమాతో జెనీలియా తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం సత్యం, సై, హ్యాపీ వంటి చిత్రాలతో అలరించింది. కానీ జెనీలియాకు నిజమైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సినిమా మాత్రం 2006లో వచ్చిన 'బొమ్మరిల్లు'. ఈ చిత్రంతో జెనీలియా అభిమానుల మనస్సులో చోటును సంపాదించుకుంది. 'హాసిని' కేరక్టర్‌లో జెనీలియా కనబరచిన అద్భుతమైన నటన, చిలిపి నవ్వులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో జెనీలియా అప్పటి స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచింది.
జెనీలియా బొమ్మరిల్లు సినిమా అనంతరం 'ఢీ', 'రెడీ', 'కొత్త బంగారు లోకం' వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జెనీలియా.. తన కెరీర్ పీక్ దశలో ఉండగానే సినిమాలకు దూరం అయింది. 2012లో వచ్చిన 'నా ఇష్టం' సినిమా తర్వాత ఆమె వెండితెరకు గుడ్‌బై చెప్పింది. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఇటీవల జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ యాక్టింగ్‌పై దృష్టి పెట్టింది. ఇటీవలే బాలీవుడ్ లో అమీర్‌ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె 'జూనియర్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెనీలియా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక నుంచి తాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తానని.. వాటి కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని జెనీలియా చెప్పుకొచ్చింది.

జెనీలియా మాట్లాడుతూ.. "నేను చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉండి సీనియర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను. అలాంటి నేను ఆడిషన్స్ ఇవ్వడమా అంటూ చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. నా ప్రకారం ఆడిషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఆడిషన్ ఇవ్వడం వల్ల సరైన పాత్రలను ఎంపిక చేసుకోవడం సులభం అవుతుంది. దాని వల్ల ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మనం అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాం. అంటే ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పులేదని నా ఫీలింగ్. ఈ విషయంలో నేను సంతోషంగా కూడా ఉన్నాను" అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది. జెనీలియా తీసుకున్న ఈ నిర్ణయం.. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి జెనీలియా నిబద్ధతను చాటి చెప్తోంది.












Click it and Unblock the Notifications