ఇట్స్ అఫీషియల్.. రామ్ పోతినేని 'RAPO 23' మూవీలో విలన్​ గా బాలీవుడ్ హీరో

తన వైవిధ్యమైన నటనతో టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని.. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి తనదైన శైలిలో మెప్పించగలిగిన అతికొద్ది మంది నటుల్లో రామ్ పోతినేని ఒకరు. 2006లో సినీ కెరీర్ ప్రారంభించిన రామ్.. తొలి సినిమా అయిన దేవదాసు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత జగడం, రెడీ, మస్కా లాంటి సినిమాలతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, పండగ చేస్కో, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన నటించిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ఓ సినిమాలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 'RAPO23'అనే వర్కింగ్ టైటిల్ పై ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే తాజాగా 'RAPO23' నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో, స్టార్ హీరోయిన్ జెనీలియా భర్త రితేశ్ దేశ్ ముఖ్ నటించనున్నారు. ఈ మేరకు ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఇక ఈ మూవీలో రామ్‌ వీర అనే శక్తివంతమైన పాత్రలో చాలా స్టైలిష్‌ గా కనిపించనున్నారు. ఈ మూవీలో రామ్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌ పై కృష్ణ పోతినేని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాక ఈ మూవీతో తొలిసారి దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు రామ్. ఓ వైపు మూవీలో నటిస్తూనే.. మరోవైపు డైరెక్షన్ చేస్తూ తన సత్తా చాటుతున్నారు.

Genelia husband to play the villain in Ram Pothineni movie RAPO 23 makers share a special video

ఇక 2008లో రెడీ సినిమాతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్ గా జెనీలియా నటించింది. అప్పటినుంచే రామ్- జెనీలియా మధ్య స్నేహం పెరిగింది. అలాగే జెనీలియా భర్త రితేష్ తోనూ రామ్ కు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే రితేష్.. రామ్ మూవీలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీ ది లోన్ వోల్ఫ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో నియో- నోయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ ను త్వరలోనే విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+